‘దండుపాళ్యం’ విడుదల జనవరి 24న

By Bojja Kumar

హైదరాబాద్ : కన్నడలో మంచి విజయం సాధించిన 'దండు పాళ్యం' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. పూజా గాంధీ, రవిశంకర్, మకరంద్, నిషా కొఠారి తదితరులు నటించిన ఈచిత్రానికి శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు. నిర్మాత వెంకట్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని జనవరి 24న రిలీజ్ చెయ్యడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ 'ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ పరంగా కూడా ఓకే. విభిన్న కథా చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు 'దండుపాళ్యం' తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. కన్నడలో సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది' అన్నారు.

'రవిశంకర్(బొమ్మాలి రవి), పూజాగాంధీ, మకరంద్, దేశ్ పాండే, రవి కాలేల నటనతో పాటు నిషా కొఠారి, రఘు ముఖర్జీ గ్లామర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. తెలుగు వాడైన దర్శకుడు శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రానికి 100%లవ్ కెమెరామెన్ వెంకట్ ప్రసాద్ ఫోటోగ్రఫీని, ఉదయ్ కిరణ్ 'ఏకలవ్వుడు' చిత్ర దర్శకుడు కె.ఆర్.కె.రాజు రచన సహకారాన్ని అందించారు' అని వెల్లడించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ...అతి క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ ఇది. గొంతు కోసే సమయంలో వచ్చే శబ్దం కోసం ఒకతను 80 మందిని మర్డర్ చేస్తాడు. దండుపాళ్యం గ్యాంగ్ గురించి ఓ జర్నలిస్టు రాసిన ఆర్టికల్ ఈ చిత్రానికి బేస్ అని తెలిపారు. రవి శంకర్, పూజా గాంధీ, మకరంద్ దేశ్ పాండే, రవి కాలె, నిషా కొఠారి, రఘు ముఖర్జీ, కర్రి సుబ్బు తదితరులు నటించిన ఈచిత్రానికి రచనా సహకారం : కె.ఆర్.కె.రాజు, కెమెరా : వెంకట్ ప్రసాద్, సంగీతం : అర్జున్ జన్య, సమర్పణ : ఆపిల్ బ్లోసమ్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాణం : వెంకట్ మూవీస్, నిర్మాత : వెంకట్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీనివాసరాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X