»   » కూతురుతో అలాంటి ముద్దులా. నేను ఒప్పుకోను.. అమీర్‌ఖాన్‌‌కు షాక్

కూతురుతో అలాంటి ముద్దులా. నేను ఒప్పుకోను.. అమీర్‌ఖాన్‌‌కు షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్నమైన పాత్రలను, చిత్రాలను చేయడంలో మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ ఎప్పుడూ ముందుంటారు. ఆ కోవలో రూపొందుతున్న చిత్రమే థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. ఈ చిత్రంలో అమీర్‌కు ఓ డ్రీమ్ సీక్వెన్స్ ఉందట. అదేంటంటే దంగల్ హీరోయిన్ ఫాతీమా సనా షేక్‌, అమీర్ మధ్య గాఢమైన ముద్దు సీన్ ఉందట. అమీర్‌ను ఫాతీమా ముద్దు పెట్టుకోవడంపై నిర్మాత ఆదిత్య అభ్యంతరం వ్యక్తం చేశాడట.

ఆదిత్యా చోప్రాకు ఇష్టం లేదట..

ఆదిత్యా చోప్రాకు ఇష్టం లేదట..

అయితే అమీర్‌ను ఫాతీమా ముద్దుపెట్టుకోవడం నిర్మాత ఆదిత్యా చోప్రాకు ఇష్టం లేదట. ఫాతీమాతో ఆ సీన్ చేయడం ఇష్టం లేదని అమీర్‌కు ఆదిత్య స్పష్టం చేసినట్టు సమాచారం.

‘దంగల్' ఫాతీమాకు నో ఛాన్స్

‘దంగల్' ఫాతీమాకు నో ఛాన్స్

అదే కారణంతో ఫాతీమాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించలేదట. ఎందుకంటే దంగల్‌లో అమీర్‌కు కూతురుగా నటించిన ఫాతీమా ముద్దు సీన్‌లో నటిస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేరని తన వాదన వినిపిస్తున్నారు.

ఫాతీమా స్థానంలో ఆలియా, కీర్తీ సనన్..

ఫాతీమా స్థానంలో ఆలియా, కీర్తీ సనన్..

ఫాతీమా స్థానంలో ఆలియాభట్, కీర్తీ సనన్, వాణీ కపూర్‌ను తీసుకొంటే బాగుంటుందనే విషయాన్ని అమీర్‌కు ఆదిత్య సూచించరట. అయితే ఆదిత్య సూచనపై ఇంకా అమీర్ నోరు విప్పకపోవడంతో హీరోయిన్ ఎంపికపై ఇంకా అసందిగ్ధత కొనసాగుతున్నదనే రూమర్ విస్తృతంగా ప్రచారంలో ఉంది.

థంగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కథ ఇదేనని ప్రచారం

థంగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కథ ఇదేనని ప్రచారం

థంగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర కథ గురించి ఓ రూమర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ప్రచారమవుతున్నది. ఈ చిత్ర కథ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కథను పోలి ఉంటుందట. ఈ చిత్రానికి విజయ్ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం 2018 సంవత్సరంలో దీపావళీకి విడుదల కానున్నది.

English summary
Aamir wanted his Dangal actress Fatima Sana Shaikh to play a small but significant role of kiss scene in the Thug Of Hindostan. But producer Aditya Chopra has refused to cast Fatima in his film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu