twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దంగల్ 2000 కోట్లు దాటలేదు, అదంతా ప్రచారమే: ఫోర్బ్స్ పత్రిక కూడా పప్పులో కాలేసిందా?

    దంగల్ సినిమా చైనాలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.2,000 కోట్లు వసూళ్లు వార్త నిజం కాదు.

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్ల ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టించింది. ఈ విష‌యాన్ని ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ కూడా ధృవీక‌రించింది. చైనాలో 53వ రోజు రూ.2.5 కోట్లు వసూలు చేసిన దంగ‌ల్‌.. ఈ అరుదైన మార్క్‌ను అందుకున్న‌ట్లు ఫోర్బ్స్ వెల్ల‌డించింది. అంతే ఆ వార్తని చూడగానే అంతా ఆనందం లో ంకునిగి పోయారు. అయితే ఇప్పుడు తెలిసిన నిజం కాస్త చేదుగానే ఉంది...

     ప్రపంచవ్యాప్తంగా 2,000 కోట్లు

    ప్రపంచవ్యాప్తంగా 2,000 కోట్లు

    బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన దంగల్ సినిమా చైనాలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.2,000 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించినట్టుగా ఇప్పటివరకు మీడియాలో అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి. కానీ అదంతా అబద్ధమే అని.. అందులో వాస్తవం లేదని తాజాగా ఆ సినిమా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

    చైనీస్ వెర్షన్ తో కలిపి

    చైనీస్ వెర్షన్ తో కలిపి

    గత గురువారం వరకు ప్రపంచవ్యాప్తంగా చైనీస్ వెర్షన్ తో కలిపి దంగల్ రాబట్టిన మొత్తం వసూళ్లు 1,864 కోట్లు మాత్రమే అని దంగల్ సినిమా అధికార ప్రతినిధి తెలిపారు. ప్రముఖ మేగజీన్ ఫోర్బ్స్ కూడా 2,000 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన భారతీయ సినిమా అంటూ దంగల్ ను ప్రశంసించింది. అసలు ఆ కథనం ఆధారంగానే అంతా నమ్మేసారు. కానీ అసలు నిజం మాత్రం ఇంకా దంగల్ 2000 కోట్లకు దూరం లోనే ఉంది.

    ఇంకా 2000 టచ్ అవ్వలేదు

    ఇంకా 2000 టచ్ అవ్వలేదు

    అయితే అయితే ఈ సినిమా 2000 కోట్లు కొట్టేసిందంటూ.. బాహుబలి 2 రేంజును కూడా దాటేసిందంటూ ఆల్రెడీ బాలీవుడ్లో సంబరాలు మొదలైన వేళ.. అబ్బే ఇంకా 2000 టచ్ అవ్వలేదు అంటే వారు ఫీలవుతున్నారు. కానీ నిజం నిజమే కదా., ఇంకో భాషలోనో మరో దేశం లోనో రిలీజ్ అయ్యేంత వరకూ ఆ మార్క్ కి చేరుకోవటం కష్టమే..

    జియావో బాబా (లెట్స్ రెజిల్, డాడ్‌)

    జియావో బాబా (లెట్స్ రెజిల్, డాడ్‌)

    ఒక్క‌రోజు క‌లెక్ష‌న్లే రూ.87.66 కోట్లు అంటే చైనాలో దంగ‌ల్ సృష్టిస్తున్న ప్ర‌భంజ‌నాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. చైనాలో షావుయ్ జియావో బాబా (లెట్స్ రెజిల్, డాడ్‌) పేరుతో మే 5న‌ దంగ‌ల్ రిలీజైంది. 9 రోజుల్లోనే ఈ మూవీ క‌లెక్ష‌న్లు రూ.300 కోట్లు దాటింది. చైనాలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన ఇండియ‌న్ మూవీగా దంగ‌ల్ రికార్డు సృష్టించింది.

    ఇంకో 150 కోట్లవరకూ గ్యాప్

    ఇంకో 150 కోట్లవరకూ గ్యాప్

    చైనాలోని 9 వేల థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ.. తొలి వారంలోనే రూ.200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్లు సాధించింది. ఇక ఆ జోరులోనే రౌండ్ ఫిగర్ క్యాచ్ చేసేస్తుంది అనుకున్నారు గానీ ఇంకో 150 కోట్లవరకూ గ్యాప్ ఉంది. అంతే కాదు ఇక ఇప్పుడు కలెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టిన సమయం లో ఇక చైనా ఆ 100 కోట్లను కూడా ముట్టజెబుతుందన్న ఆశలేదు.

    English summary
    Dangal's box office collection at Rs 1,848 crore, not Rs 2,000 crore, clarifies film's spokesperson
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X