twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్రినా కైఫ్ ని డౌన్ లోడ్ చేస్తే...

    By Staff
    |

    Katrina Kaif
    ఇంటర్నెట్ లో కత్రినా కైఫ్ ఫొటోను డౌన్ లోడ్ చేస్తే సిస్టమ్ క్రాష్ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మెకాఫీ(McAfee) అనే యాంటివైరస్ సంస్ధ తెలియచేస్తూ ప్రకటన విడుదల చేసింది. కత్రినా స్క్రీన్ పేపర్లు, వాల్ పేపర్లు డౌన్ లోడ్ చేసుకుంటే కంప్యూటర్ లోకి వైరస్ చొరబడి ముఖ్యమైన ఫైళ్లను డిలీట్ చేస్తుందని తెలిపింది. అంతేగాక కంప్యూటర్ లోని ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇది ద్వంసం చేస్తుందని పేర్కొంది. ఇక ఇంటర్నెట్ లో ఎక్కువ సంఖ్యలో డౌన్ లోడ్ అయ్యే పిక్చర్స్ లో కత్రినాకైఫ్ ప్రధమస్ధానంలో ఉందన్న సంగతి తెలిసిందే.

    ఇక ఇది కొత్తేమి కాదని, సైబర్ నేరగాళ్ళు చాలా కాలంగా అనుసరిస్తున్న వ్యూహం ఇదేనని చెప్తున్నారు. ఏదైతే ఎక్కువ డౌన్ లోడ్ అవుతుందో వాటిని ఫ్రీ గా ఆఫర్ చేసి వినియోగదారులను ఆకర్షించి వైరస్ ని పంపుతారని ఆ సంస్ధ తెలియచేస్తోంది.ఈ విషయమై మెకాఫీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ షార్క్ లు ఎలా రక్తపు వాసనకు ఎలా ఎట్రాక్ట్ అవుతాయో అలాగే హాకర్స్ కూడా కన్సూమర్స్ బలహీనతలను ఉత్తినే గెస్ చేస్తారు అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X