twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    No Time To Die: రెడ్ కార్పెట్ పై ఆఖరి జేమ్స్ బాండ్‌.. అందరి ఫోకస్ అతని వైపే!

    |

    జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా సీరీస్ లు బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటున్నాయి అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా హాలీవుడ్ సినిమాల స్థాయినీ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ జేమ్స్ బాండ్ సినిమా లో ఎంతోమంది కథానాయకుడు మారారు. ఇక చివరి సారి డేనియల్ క్రిక్ నటిస్తున్న no time to die పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి త్వరలోనే సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులలో ప్రతి రోజు ఎదో ఒక విషయంలో ఆఖరి జేమ్స్ బాండ్ అంచనాలను క్రియేట్ చేస్తూనే ఉన్నాడు.

    డేనియల్ క్రెయిగ్ యొక్క చివరి జేమ్స్ బాండ్ చిత్రం ఎట్టకేలకు దాని ప్రపంచ ప్రీమియర్‌ను లండన్‌లో నిర్వహించారు. దాదాపు 18 నెలల తరువాత వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటుడు డేనియల్ క్రెయిగ్ మంగళవారం లండన్‌లో తన సినిమా 'నో టైమ్ టు డై' ప్రపంచ ప్రీమియర్ కోసం చివరిసారిగా రెడ్ కార్పెట్ మీద నడిచారు. 53 ఏళ్ల ఈ ఇంగ్లీష్ నటుడు 'నో టైమ్ టు డై' విడుదల తర్వాత జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నుండి రిటైర్ కానున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న భారతదేశంలో విడుదల అవుతుంది.

     Daniel Craigs last film as a James Bond No Time To Die royal premiere

    2006 సినిమా క్యాసినో రాయల్‌లో డేనియల్ క్రెయిగ్ మొదటిసారి బ్రిటిష్ గూఢచారిగా కనిపించారు. దీని తరువాత క్వాంటం ఆఫ్ సోలెస్ (2008), స్కైఫాల్ (2012) మరియు స్పెక్టర్ (2015) వంటి సినిమాలు వచ్చాయి. ఇంతకుముందు, ఈ చిత్రాన్ని 2020 ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా విడుదల తేదీ అనేకసార్లు వాయిదా పడింది. నో టైమ్ టు డైకి క్యారీ జోజి ఫుకునాగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లీ సెడాక్స్, రాల్ఫ్ ఫియెన్స్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, నవోమీ హారిస్, బెన్ విషా, రోరీ కిన్నీర్, లషనా లించ్, బిల్లీ మాగ్నస్సెన్ మరియు జెఫ్రీ రైట్ సహాయక పాత్రల్లో నటించారు. రామి మాలెక్ మెయిన్ విలన్ గా లియుట్సిఫర్ సఫిన్ పాత్రలో కనిపించనున్నారు.

    నో టైమ్ టూ డై అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే కొన్ని రికార్డులను బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లమంది ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ట్విస్టులు కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని ఇదివరకే ట్రైలట్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక పాండమిక్ తరువాత ప్రపంచంలోనే అత్యదిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా నో టైమ్ టూ డై సరికొత్త రికార్డులను బ్లాస్ట్ చేస్తుందని అర్థమవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ గత సినిమాల కంటే ఎక్కువ స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. మరి సినిమా అభిమానుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

    English summary
    Daniel Craig's last film as a James Bond No Time To Die royal premiere
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X