అతను...16 ఏళ్లకే శృంగార హీరో!!!

ఎనిమిదేళ్లపాటు హ్యారీ పోటర్ సినిమా చిత్రీకరణలోనే గడిపిన రాడ్‌క్లిఫ్ త్వరలో ఈఖ్వస్ అనే చిత్రంలో మానసిక రోగిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీబిజీగా ఉన్న రాడ్‌క్లిఫ్... తన జీవితంలో గర్ల్‌ఫ్రెండ్‌కి స్థానం లేదంటున్నాడు. "నా స్నేహితుల్లో ఎక్కువమంది అమ్మాయిలే. వాళ్లు వాళ్ల బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటున్నారన్న విషయం నాకు తెలిసిందే. అందుకే ఆ పని నేను చేయదలచుకోలేదు. ప్రస్తుతం నాకంత తీరికా లేదు'' అని అన్నాడు. ఇక ఈ కుర్రాడుకి ప్రపంచ వాప్తంగా చాలా మంది బాలబాలికలు ఫ్యాన్స్ ఉన్నారు.


Click it and Unblock the Notifications