ఆస్కార్ స్లమ్ డాగ్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరుతెచ్చుకున్న డానీ బోయెల్ ముంబయి నైట్ లైఫ్ ఆధారంగా మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. మాగ్జిమమ్ సిటీ..ముంబయి లాస్ట్ అండ్ ఫౌండ్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఎన్నారై రైటర్ కమ్ జర్మలిస్ట్ సేతు మెహతా రాసిన ఈ పుస్తకం అప్పట్లో మంచి ప్రాచుర్యం పొందింది. 2004 లో నాలుగు లో ప్రచురితమైన ఈ నవలలో కథనం ధ్రిల్లర్ గా సాగుతుంది. ఈ కథలో ముంబయి స్లమ్, డాన్సిగ్ గర్ల్, అండర్ వరల్డ్ డాన్స్, హిందూ రాడికల్స్ నైట్ జీవితాలు ఉంటాయి. ఇక స్లమ్ డాగ్ కూడా వికాస్ స్వరూప్ రాసిన క్యూ అండ్ ఎ నవల ఆధారంగా రూపొందిందినదే.