Sir Telugu Trailer: క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి.. మాస్ స్టైల్ లో ధనుష్ మెస్సేజ్!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ ఈసారి మరో ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో సరికొత్త పాయింట్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక ఈసారి ఎడ్యుకేషన్ అనే పాయింట్ తో మరో ఎంటర్టైన్మెంట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. సార్ అనే మూవీ ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎడ్యుకేషన్ మాఫియా

ఎడ్యుకేషన్ మాఫియా

నా గురువు బాలు సార్ అనే స్టోరీ లైన్ తో ఈ ట్రైలర్ మొదలైన విధానమే పిరియడ్ డ్రామా అని క్లారిటీ వచ్చేసిందే. ఇప్పటివరకు అన్ ప్రాఫిటబుల్ సర్వీస్ అనే వ్యవస్థతో కొనసాగుతున్న ఎడ్యుకేషన్ ను త్రిపాటి ఎడ్యుకేషనల్ అనే ఇన్స్టిట్యూషన్స్ తరఫున స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలను దత్తత తీసుకొని ఒక మాఫియాగా కొనసాగించాలి అనే విలన్స్ ప్లాన్ వేస్తున్నట్లుగా ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చారు.

ధనుష్ సింపుల్ 'సార్' క్యారెక్టర్

ధనుష్ సింపుల్ 'సార్' క్యారెక్టర్

ఇక త్రిపాటి ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఫ్యాకల్టీగా కొంతమంది ఉపాధ్యాయులను గవర్నమెంట్ కాలేజ్ లకు పంపిస్తారు. ఇక అందులో హీరో ధనుష్ కూడా ఒక ఉపాధ్యాయుడుగా కనిపించబోతున్నట్లు చూపించారు. ఇక ధనుష్ ఇందులో మొదటి నుంచి కూడా చాలా అల్లరిగా మాస్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్ తో హైలెట్ అవుతూ కనిపిస్తున్నాడు. అతనితోపాటు మరో తెలుగు కమెడియన్ హైపర్ ఆది ఉండడం విశేషం.

 హీరోయిన్ తో కెమిస్ట్రీ

హీరోయిన్ తో కెమిస్ట్రీ

ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఒక బయాలజీ టీచర్ గా నటించింది. ఇక ఆమెను అట్రాక్ట్ చేసేందుకు హీరో చేసే అల్లరి పనులు కూడా ఇందులో హైలెట్ అవుతున్నాయి. ఇక ఈ కాలేజీలో.పిల్లలకు మీరు మంచి చేసేవారిగా కనిపిస్తున్నారు అంటూ వారి మధ్యలో కొనసాగిన సన్నివేశం ఆ తర్వాత వచ్చే మాస్టారు సాంగ్ కూడా ట్రైలర్లో ఎంతగానో హైలెట్ అవుతుంది.

పవర్ఫుల్ విలన్

పవర్ఫుల్ విలన్

ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో సముద్రఖని నటించాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే కాసులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఉన్నవాడు ఇస్తాడు.. తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు అని.. సముద్రకని చెప్పిన డైలాగ్ తోనే అతని విళనిజం హైలైట్ అయింది. ఇక ఈ మాఫియా నుంచి హీరో ఏ విధంగా పేద విద్యార్థులకు మళ్ళీ విద్య అందేలా చేయాలని అనుకుంటాడు అనేది హైలెట్ పాయింట్ అని అర్థమవుతుంది.

వెంకీ అట్లూరి డిఫరెంట్ మూవీ

వెంకీ అట్లూరి డిఫరెంట్ మూవీ

ఇక ఎడ్యుకేషన్ తో వ్యాపారం చేయాలనుకునే మాఫియాను హీరో ఎలా అడ్డుకున్నాడు వల్ల ఛాలెంజ్ లకు అతను ఇలా అడ్డు తగిలాడు అనేది కూడా ఈ సినిమాలో ప్రధానాంశంగా తెలుస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఇంతకుముందు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను అనే ప్రేమ కథలతో మెప్పించాడు. కానీ ఈసారి అతను డిఫరెంట్ గా ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ వెనకాల ఉండే మాఫియాను హైలెట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. సార్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 17వ తేదీన సార్ సినిమా గ్రాండ్ గా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X