సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కాదు.. ఇండియన్ సూపర్‌స్టార్.. అదే రజనీ గొప్పతనం

కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్, దర్శకుడు ఏఆర్ మురగదాస్, టాగూర్ మధు, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తదితరులు హాజరయ్యారు. వేదిక వద్దకు రజనీ రాగానే హాలులో అభిమానులు పెద్ద పెట్టున కేరింతలు, అరుపులతో జోష్ పెంచారు. రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేసి వేడుకలో భాగమయ్యారు.

నేను ఇక్కడి డైరెక్టర్‌గా రాలేదు. ఓ అభిమానిగా వచ్చాను. నిర్మాత ప్రసాద్ గారు పిలువగానే.. హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు రజనీకాంత్‌తో ఫోటో దిగలేదు. ఆ కోరిక ఇప్పుడు తీరింది. డిజిటల్ మీడియా రాకముందే అన్ని రికార్డులు తిరగరాశారు. గతంలో భాషా, ముత్తు ఫంక్షన్లు జరుగలేదు అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. మీరు శంకర్ పనిచేశారు.. ఇకముందు హరీష్ శంకర్‌తో పనిచేయండి సార్ అంటూ వేడుకొన్నారు.

Darbar Pre Release Event: Dil Raju, Harish Shankar Speech

రజనీకాంత్‌లో గొప్పతనం ఏమిటంటే.. హిందీలో నటిస్తే హమారా హీరో అనుకొంటారు. తెలుగు మన రజనీకాంత్ సినిమా వస్తుందనుకొంటారు. కన్నడలో ఆయన పేటెంట్‌గా అనుకొంటారు. తమిళంలో ఇక చెప్పనక్కర్లేదు. ఆయన సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ కాదు.. ఇండియన్ సూపర్ స్టార్ అని హరీష్ శంకర్ ఉద్వేగానికి గురయ్యారు.

దర్బార్ సినిమా ట్రైలర్‌లో రజనీకాంత్ నడిచి వచ్చే స్టయిల్ చూసి ఫిదా అయ్యాను. అప్పటి నుంచి నేను ఆయనకు ఫ్యాన్‌ను. నేను జీవనపోరాటం సినిమాలో రజనీ స్టయిల్ చూసి అనుకరించాను. కానీ నేను సక్సెస్ కాలేదు. ఇక మురుగదాస్ తెలుగు, తమిళం, హిందీలో ఇరుగదీశారు. ఇప్పుడ దర్బార్‌తో అన్ని భాషల్లో ఈ సినిమాతో మురుగదాస్ ఇరుగదీయడం ఖాయం అని దిల్ రాజు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X