Darbar Pre Release Event: నేను రజనీకాంత్‌కు పెద్ద ఫ్యాన్.. గర్వంగా ఉంది..
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమేమీ లేదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు రజినీ స్టైల్, మ్యానరిజంకు అభిమానులే. సామాన్య జనం నుంచి స్టార్ హీరోల వరకు తలైవాను ఫాలో అవుతూ ఉంటారు. ఆరు పదుల వయసు దాటిన అలుపెరుగకుండా సినిమాలను చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.
ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్, దర్శకుడు ఏఆర్ మురగదాస్, టాగూర్ మధు, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తదితరులు హాజరయ్యారు. వేదిక వద్దకు రజనీ రాగానే హాలులో అభిమానులు పెద్ద పెట్టున కేరింతలు, అరుపులతో జోష్ పెంచారు. రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేసి వేడుకలో భాగమయ్యారు.

అందరిలాగానే రజనీకాంత్‌కు నేను పెద్ద ఫ్యాన్. తొలిసారి రజనీసార్ నటించిన రాజా చిన్న రోజా అనే సినిమా చూశాను. ఆ తర్వాత భాషా చూశాను. ఆ సినిమా డైలాగ్స్ అన్ని చెప్పగలను. రజనీకాంత్ ఫ్యాన్ అయిన నాకు ఆయన సినిమాకు పాట రాసే అవకాశం ఇచ్చిన అనిరుధ్‌కు థ్యాంక్స్. పెళ్లి పాట చాలా బాగుంటుంది. ఆ పాటకు రజనీ సార్ స్టెప్పులు వేసి అదరగొట్టారు అని గేయ రచయిత కృష్ణకాంత్ అన్నారు.
ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల మాట్లాడుతూ.. గతంలో రజనీకాంత్ సినిమా 2.0 కోసం ఓ పాట రాశాను. ఆ తర్వాత పేట సినిమాకు పనిచేశాను. అంతలోనే దర్బార్ సినిమాకు పనిచేసే అవకాశం రావడం గర్వంగా ఉంది. ఇది నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ అని అన్నారు. ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్, దర్శకుడు ఏఆర్ మురగదాస్ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











