Darbar Pre Release Event:అందరి హీరోలకు నచ్చే ఒకే ఒక వ్యక్తి.. నివేదా థామస్ కామెంట్స్

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమేమీ లేదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు రజినీ స్టైల్, మ్యానరిజంకు అభిమానులే. సామాన్య జనం నుంచి స్టార్ హీరోల వరకు తలైవాను ఫాలో అవుతూ ఉంటారు. ఆరు పదుల వయసు దాటిన అలుపెరుగకుండా సినిమాలను చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.

దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నివేదా థామస్ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. కొద్ది క్రితం వరకు బాగానే ఉన్నాను.. దుమ్ము ధూళి సాంగ్ చూసే సరికి ఏదో అయింది. షూటింగ్ జరిగేప్పుడు పక్కనే ఉన్నా.. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే.. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఈ సినిమాలో ఈ పాత్రను నేను చేయగలనని నా మీద నమ్మకం పెట్టి అవకాశమిచ్చిన మురుగదాస్‌కు థ్యాంక్స్.

Darbar Pre Release Event live: Nivetha Thomas speech

ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరూ అద్భుతంగా చేశారు. రామ్ లక్ష్మణ్ మాష్టర్స్.. ఆ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. ఇంకా ఏడు రోజులే ఉన్నాయి.. తరువాత అందరూ అదే చెబుతారు. నేను రజినీ సర్‌ గురించి ఎన్నో సార్లు చెబుతూ వస్తున్నాను. సెట్లో ఆయనను చూస్తునే ఉంటాను.. ఎలా చెబుతున్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను.

ఇక్కడికి వచ్చాక ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. మనం దళపతి విజయ్, తలాఅజిత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని ఇలా ఎంతమందిని అయినా ఇష్టపడొచ్చు.. అయితే వారందరికీ నచ్చే ఒకే ఒక వ్యక్తి రజినీ సర్. ఇక్కడ తెలుగు కాకుండా హిందీ, తమిళ్ సినిమాలు ఏవీ వచ్చినా డబ్బింగ్‌లా కాకుండా.. సొంత సినిమాలా ఆదరిస్తారు.. ఈ చిత్రాన్ని అందరూ చూడండి.. చాలా బాగుంటుంది. థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ లవ్'అంటూ ముగించేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X