For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Darbar Pre Release Event live: సౌత్ ఇండియా కాదు.. ఇండియన్ సూపర్‌స్టార్..రజనీ గొప్పతనమదే: హరీష్ శంకర్

  |
  Darbar Pre Release Event : Murugadoss Mind Blowing Words On Rajinikanth's Style

  ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమేమీ లేదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు రజినీ స్టైల్, మ్యానరిజంకు అభిమానులే. సామాన్య జనం నుంచి స్టార్ హీరోల వరకు తలైవాను ఫాలో అవుతూ ఉంటారు. ఆరు పదుల వయసు దాటిన అలుపెరుగకుండా సినిమాలను చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.

  ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్, దర్శకుడు ఏఆర్ మురగదాస్, టాగూర్ మధు, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తదితరులు హాజరయ్యారు. వేదిక వద్దకు రజనీ రాగానే హాలులో అభిమానులు పెద్ద పెట్టున కేరింతలు, అరుపులతో జోష్ పెంచారు. రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేసి వేడుకలో భాగమయ్యారు.

  నా కెరీర్‌లో దర్బార్ ఎంతో ఇంపార్టెంట్..

  నా కెరీర్‌లో దర్బార్ ఎంతో ఇంపార్టెంట్..

  దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్టాడుతూ.. ‘ఎలా ఉన్నారు.. బాగున్నారా.. చాలా రోజులైంది.. ఇక్కడి వచ్చిన వారందరికీ నమస్కారం, రజినీకాంత్ సర్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు నమస్కారం. దర్బార్ సినిమా నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్..ఎందుకంటే సూపర్ స్టార్‌తో ఫస్ట్ సినిమా..అంతేకాకుండా మొదటి సారి ఓ కాప్ స్టోరీ చేశాను. బాగా వచ్చింది. మీరు కూడా చూసి చెప్పండి. ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు తీయాలంటే దానికి మంచి ప్రొడ్యూసర్లు కావాలి. సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని చక్కగా నిర్మించారు. ఆయన స్వతహాగానే హీరో.. ఆయన జీవితంలో ఎన్నో మంచి సంఘటనలున్నాయి.. ఆయన బయోపిక్ తీయాలి.. ఈచిత్రంలో హీరోయిన్‌గా నయనతార బాగా చేశారు. ఆమెకు థ్యాంక్స్. నివేదా థామస్ ఓ మంచి పాత్రను పోషించారు.సినిమా రిలీజ్ అయ్యాక ఆమెకు మంచి పేరు వస్తుంది.

  గాడ్ ఆఫ్ సినిమా

  గాడ్ ఆఫ్ సినిమా

  సునీల్ శెట్టి మాట్టాడుతూ.. ‘మీరు రజినీకాంత్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో.. నేను కూడా అంతే ప్రేమిస్తున్నాను. దర్బార్ టీమ్ మంచి టీమ్.. మురుగదాస్ బెస్ట్ గురు.. అందర్నీ బాగా గైడ్ చేశారు. సంతోష్ శివన్ లాంటి వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ లక్ష్మణ్ మాష్టర్లలో రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో ఇప్పటికీ తెలీదు.. ఆ ఇద్దరికీ థ్యాంక్స్..అనిరుధ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు లైకా వారికి, సుభాస్కరణ్‌కు ధన్యవాదాలు. రజినీ కేవలం సూపర్ స్టార్ కాదు.. గాడ్ ఆఫ్ సినిమా. ప్రతీ ఒక్కరిలో ఆయనకు సంబంధించినది ఏదో ఒకటి ఉంటుంది. నేను ఆయన్ను కలిసి ప్రతీ సారి ఏదో ఒకటి నేర్చుకున్నాన'ని తెలిపారు.

  అందరి హీరోలకు నచ్చే ఒకే ఒక వ్యక్తి.. నివేదా థామస్ కామెంట్స్

  అందరి హీరోలకు నచ్చే ఒకే ఒక వ్యక్తి.. నివేదా థామస్ కామెంట్స్

  ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరూ అద్భుతంగా చేశారు. రామ్ లక్ష్మణ్ మాష్టర్స్.. ఆ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. ఇంకా ఏడు రోజులే ఉన్నాయి.. తరువాత అందరూ అదే చెబుతారు. నేను రజినీ సర్‌ గురించి ఎన్నో సార్లు చెబుతూ వస్తున్నాను. సెట్లో ఆయనను చూస్తునే ఉంటాను.. ఎలా చెబుతున్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. మనం దళపతి విజయ్, తలాఅజిత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని ఇలా ఎంతమందిని అయినా ఇష్టపడొచ్చు.. అయితే వారందరికీ నచ్చే ఒకే ఒక వ్యక్తి రజినీ సర్. ఇక్కడ తెలుగు కాకుండా హిందీ, తమిళ్ సినిమాలు ఏవీ వచ్చినా డబ్బింగ్‌లా కాకుండా.. సొంత సినిమాలా ఆదరిస్తారు.. ఈ చిత్రాన్ని అందరూ చూడండి.. చాలా బాగుంటుంది. థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ లవ్'అంటూ ముగించేసింది.

  మీరు ఇండియన్ సూపర్‌స్టార్

  మీరు ఇండియన్ సూపర్‌స్టార్

  రజనీకాంత్‌లో గొప్పతనం ఏమిటంటే.. హిందీలో నటిస్తే హమారా హీరో అనుకొంటారు. తెలుగు మన రజనీకాంత్ సినిమా వస్తుందనుకొంటారు. కన్నడలో ఆయన పేటెంట్‌గా అనుకొంటారు. తమిళంలో ఇక చెప్పనక్కర్లేదు. ఆయన సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ కాదు.. ఇండియన్ సూపర్ స్టార్ అని హరీష్ శంకర్ ఉద్వేగానికి గురయ్యారు.

  అభిమానిగా వచ్చా

  అభిమానిగా వచ్చా

  నేను ఇక్కడి డైరెక్టర్‌గా రాలేదు. ఓ అభిమానిగా వచ్చాను. నిర్మాత ప్రసాద్ గారు పిలువగానే.. హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు రజనీకాంత్‌తో ఫోటో దిగలేదు. ఆ కోరిక ఇప్పుడు తీరింది. డిజిటల్ మీడియా రాకముందే అన్ని రికార్డులు తిరగరాశారు. గతంలో భాషా, ముత్తు ఫంక్షన్లు జరుగలేదు అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. మీరు శంకర్ పనిచేశారు.. ఇకముందు హరీష్ శంకర్‌తో పనిచేయండి సార్ అంటూ వేడుకొన్నారు.

  అన్ని భాషల్లో ఇరుగదీయం ఖాయం

  అన్ని భాషల్లో ఇరుగదీయం ఖాయం

  దర్బార్ సినిమా ట్రైలర్‌లో రజనీకాంత్ నడిచి వచ్చే స్టయిల్ చూసి ఫిదా అయ్యాను. అప్పటి నుంచి నేను ఆయనకు ఫ్యాన్‌ను. నేను జీవనపోరాటం సినిమాలో రజనీ స్టయిల్ చూసి అనుకరించాను. కానీ నేను సక్సెస్ కాలేదు. ఇక మురుగదాస్ తెలుగు, తమిళం, హిందీలో ఇరుగదీశారు. ఇప్పుడ దర్బార్‌తో అన్ని భాషల్లో ఈ సినిమాతో మురుగదాస్ ఇరుగదీయడం ఖాయం అని దిల్ రాజు అన్నారు.

  శిల్పా కళా వేదికకు కళ వచ్చింది...

  శిల్పా కళా వేదికకు కళ వచ్చింది...

  దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ఇలా మీ ముందు మాట్లాడాలంటే చాలా అదృష్టం ఉండాలి. నిజంగా ఇప్పుడు శిల్పా కళా వేదికకు కళ వచ్చినట్టుంది. పవర్ స్టార్ వస్తే ఎలా ఉంటుందో.. ఆయన పాట వస్తే ఇంతకుముందు గూస్ బంప్స్ వచ్చాయి.. ఈ సినిమాలో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పని చేశారు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే రజినీ మళ్లీ బ్యాక్ అయినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రం ఎన్వీ ప్రసాద్, యూవీకి మంచిపేరు తీసుకురావాల'ని అన్నాడు.

  దర్బార్ మా హృదయానికి చేరువైన సినిమా

  దర్బార్ మా హృదయానికి చేరువైన సినిమా

  రజనీకాంత్ ఫ్యాన్స్‌కు నమస్కారం. దర్బార్ మాకు చాలా ప్రత్యేకమైనది. మా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా. మాకు స్ఫూర్తిని ఇచ్చే హీరో తలైవా రజనీకాంత్. ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు మురుగదాస్‌కు థ్యాంక్స్. లైకా ప్రొడక్షన్ అధినేత సుభాష్కరన్‌కు ధన్యవాదాలు అని అనిరుధ్ అన్నారు.

  అందరిలాగానే రజనీకాంత్‌కు నేను పెద్ద ఫ్యాన్.

  అందరిలాగానే రజనీకాంత్‌కు నేను పెద్ద ఫ్యాన్.

  తొలిసారి రజనీసార్ నటించిన రాజా చిన్న రోజా అనే సినిమా చూశాను. ఆ తర్వాత భాషా చూశాను. ఆ సినిమా డైలాగ్స్ అన్ని చెప్పగలను. రజనీకాంత్ ఫ్యాన్ అయిన నాకు ఆయన సినిమాకు పాట రాసే అవకాశం ఇచ్చిన అనిరుధ్‌కు థ్యాంక్స్. పెళ్లి పాట చాలా బాగుంటుంది. ఆ పాటకు రజనీ సార్ స్టెప్పులు వేసి అదరగొట్టారు అని గేయ రచయిత కృష్ణకాంత్ అన్నారు.

  ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల మాట్లాడుతూ..

  ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల మాట్లాడుతూ..

  గతంలో రజనీకాంత్ సినిమా 2.0 కోసం ఓ పాట రాశాను. ఆ తర్వాత పేట సినిమాకు పనిచేశాను. అంతలోనే దర్బార్ సినిమాకు పనిచేసే అవకాశం రావడం గర్వంగా ఉంది. ఇది నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ అని అన్నారు. ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్, దర్శకుడు ఏఆర్ మురగదాస్ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను అని అన్నారు.

  ఇద్దరే స్టార్లు.. ఇక్కడ మెగాస్టార్, అక్కడ సూపర్ స్టార్

  ఇద్దరే స్టార్లు.. ఇక్కడ మెగాస్టార్, అక్కడ సూపర్ స్టార్

  ఆకాశంలో ఎన్నో స్టార్లు ఉన్నాయి. కానీ మనకు తెలిసినవి రెండే స్టార్లు. తెలుగులో మెగాస్టార్.. తమిళంలో సూపర్ స్టార్. మేము చిరంజీవి సర్‌తో కూడా చేశాము కానీ, తమిళంలో, తలైవాతో కలిసి పనిచేయాలని ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్నాము. మాకు ఈ అవకాశమిచ్చిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు థ్యాంక్స్. ఫస్ట్ షెడ్యూల్‌లోనే యాక్షన్ సీక్వెన్స్‌ తెరకెక్కించాలని మాకు చెప్పారు. అందుకోసం ముందుగానే ముంబై వెళ్లి అంతా సెట్ చేసి కంపోజ్ చేసి రెడీగా ఉన్నాము. ఇంతలో రజినీ సర్ అక్కడి వచ్చారు. ఆయనతో డిస్కషన్ చేద్దామని క్యారవ్యాన్‌లోకి వెళ్తే ఆయన ఓ మూలన కూర్చుని సాధారణంగా ఉన్నారు. మనం ఇంత పెద్దగా ఫైట్ కంపోజ్ చేశాము.. సర్ చేస్తారా? లేదా అని అనుమానంతో ఉన్నాము. ఆయన ఓ గంట తరువాత మేకప్ వేసుకుని కళ్ల జోడు పెట్టుకుని అలా వచ్చి సింపుల్‌గా చేసేశారు. ఆయన ముందు మేము చేసిన ఫైట్ చాలా చిన్నది అయింది.

  English summary
  Rajinikanth's Darbar set to release for Sankranti festival. In wake of release, Pre Release Event held at Hyderabad Shilpa Kala Vedika. Rajinikanth, Sunil Shetty are the geust for the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X