Darbar Pre Release Event live: ఇక్కడ మెగాస్టార్.. అక్కడ సూపర్‌స్టార్.. ఆ రెండు సీన్లు అదుర్స్
Recommended Video
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమేమీ లేదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు రజినీ స్టైల్, మ్యానరిజంకు అభిమానులే. సామాన్య జనం నుంచి స్టార్ హీరోల వరకు తలైవాను ఫాలో అవుతూ ఉంటారు. ఆరు పదుల వయసు దాటిన అలుపెరుగకుండా సినిమాలను చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.
ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్, దర్శకుడు ఏఆర్ మురగదాస్, టాగూర్ మధు, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తదితరులు హాజరయ్యారు. వేదిక వద్దకు రజనీ రాగానే హాలులో అభిమానులు పెద్ద పెట్టున కేరింతలు, అరుపులతో జోష్ పెంచారు. రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేసి వేడుకలో భాగమయ్యారు.

పెట్టాలి.. కొట్టాలి..
దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫైట్ మాష్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని తొందరగా పిలిచినందుకు రెండు మాటలు ఎక్కువగా మాట్లాడుతాము ఏమనుకోకండి. ఇక్కడికి వచ్చిన రజినీకి నమస్కారం, ఆయన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. ఒకర్ని చూస్తే పెట్టాలి.. మరొకర్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది. రజినీ సర్‌ను చూస్తే పెట్టాలనిపిస్తుంది.

ఇద్దరే స్టార్లు..
ఆకాశంలో ఎన్నో స్టార్లు ఉన్నాయి. కానీ మనకు తెలిసినవి రెండే స్టార్లు. తెలుగులో మెగాస్టార్.. తమిళంలో సూపర్ స్టార్. మేము చిరంజీవి సర్‌తో కూడా చేశాము కానీ, తమిళంలో, తలైవాతో కలిసి పనిచేయాలని ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్నాము. మాకు ఈ అవకాశమిచ్చిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు థ్యాంక్స్.

నాలుగు అడుగులే కానీ..
ఏఆర్ మురుగదాస్ ఉన్నది నాలుగు అడుగులే కానీ ఆయన విజన్ మాత్రం ఆకాశమంత ఉంటుంది. కొందరు డబ్బుల కోసం సినిమాలు చేస్తారు. కానీ ఆయన మాత్రం సమాజం కోసం చేస్తారు. స్టాలిన్ లాంటి చిత్రం తీసి ఓ మంచి సందేశాన్నిచ్చారు. సంతోష్ శివన్ లాంటి గొప్ప కెమెరామెన్‌తో పని చేయడం అంటే మొదట్లో భయం వేసింది. అలాంటి గొప్ప వ్యక్తితో పనిచేసే అవకాశమిచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్.

రజినీ చేస్తారా అని అనుకున్నాము..
ఫస్ట్ షెడ్యూల్‌లోనే యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించాలని మాకు చెప్పారు. అందుకోసం ముందుగానే ముంబై వెళ్లి అంతా సెట్ చేసి కంపోజ్ చేసి రెడీగా ఉన్నాము. ఇంతలో రజినీ సర్ అక్కడి వచ్చారు. ఆయనతో డిస్కషన్ చేద్దామని క్యారవ్యాన్‌లోకి వెళ్తే ఆయన ఓ మూలన కూర్చుని సాధారణంగా ఉన్నారు. మనం ఇంత పెద్దగా ఫైట్ కంపోజ్ చేశాము.. సర్ చేస్తారా? లేదా అని అనుమానంతో ఉన్నాము. ఆయన ఓ గంట తరువాత మేకప్ వేసుకుని కళ్ల జోడు పెట్టుకుని అలా వచ్చి సింపుల్‌గా చేసేశారు. ఆయన ముందు మేము చేసిన ఫైట్ చాలా చిన్నది అయింది.

ఆ రెండు యాక్షన్ సీన్స్ హైలెట్
ఆయన మేకప్ వేస్తే ఒకలా తీస్తే మరోలా.. హిమాలయాలకు వెళ్లే స్వామిజీలా ఉంటారు. ఆయన వయసు ఈ మధ్య 70కి చేరింది.. కానీ ఆయనతో వర్క్ చేస్తే ఏడేళ్ల అబ్బాయితో చేసినంత ఈజీగా అనిపించింది. ఈ చిత్రంలో ఇంట్రడక్షన్ ఫైట్, రైల్వే స్టేషన్ ఫైట్ అదిరిపోతాయి. ఈలలు వేస్తూనే ఉంటారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లు అంత గొప్పగా రావడానికి మా అసిస్టెంట్లే కారణం. మేము 5 శాతం చేస్తే వారు 95 శాతం చేస్తారు.. మేము గన్స్ అయితే వారు బుల్లెట్లు' అని ప్రసంగించారు.


Click it and Unblock the Notifications











