Darbar Pre Release Event: ఆ స్పీచ్‌కు చప్పట్లు కొడుతూనే ఉన్నాను.. శిల్పా కళా వేదికలకు కళ వచ్చింది..
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమేమీ లేదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు రజినీ స్టైల్, మ్యానరిజంకు అభిమానులే. సామాన్య జనం నుంచి స్టార్ హీరోల వరకు తలైవాను ఫాలో అవుతూ ఉంటారు. ఆరు పదుల వయసు దాటిన అలుపెరుగకుండా సినిమాలను చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.

ఆ స్పీచ్‌కు చప్పట్లు కొడుతూనే ఉన్నాను..
ఈ వేడుకలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘నేను దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్తున్నానని మా ఆవిడకు చెప్పాను.. ‘నువ్వు చాలా లక్కీ' అని మా ఆవిడ చెప్పింది. మీ ముందు నిలబడి ఇలా మాట్లాడటం నిజంగా అదృష్టం. మీరు తమిళ ఆడియో ఫంక్షన్‌లో ఇచ్చిన స్పీచ్ వింటూ చప్పట్లు కొడుతూనే ఉన్నాను. మిమ్మల్ని నిర్మాత అవమానిస్తే.. రెండేళ్లు కష్టపడి ఓ ఫారిన్ కార్‌ను కొని, ఇంగ్లీష్ డ్రైవర్‌ను పెట్టుకుని అదే నిర్మాత వద్దకు వెళ్లడం.. ఆ స్పీచ్ వస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూనే ఉన్నాను.

రజినీ నాటే నేమ్..
మీ డెడికేషన్‌తో, మీ వర్క్‌తో ఎన్నో జనరేషన్లను ఇన్స్‌పైర్ చేశారు. రజినీ నాటే నేమ్.. ఇట్సే ఫినామినా.. ఏఆర్ మురుగదాస్ గొప్ప విజన్ ఉన్న దర్శకుడు. మీ ఇద్దరి కాంబినేషన్ గురించి ఎంతో ఎదురుచూస్తున్నాను. జనవరి 9కి ఇంకా ఒక్క వారమే ఉంది. సినిమాను చూసేందుకు ఎదురుచూస్తున్నాను. సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. దర్బార్ థియేటర్లలో కలుద్దామ'ని ముగించాడు.

శిల్పా కళా వేదికకు కళ వచ్చింది...
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ఇలా మీ ముందు మాట్లాడాలంటే చాలా అదృష్టం ఉండాలి. నిజంగా ఇప్పుడు శిల్పా కళా వేదికకు కళ వచ్చినట్టుంది. పవర్ స్టార్ వస్తే ఎలా ఉంటుందో.. ఆయన పాట వస్తే ఇంతకుముందు గూస్ బంప్స్ వచ్చాయి.. ఈ సినిమాలో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పని చేశారు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే రజినీ మళ్లీ బ్యాక్ అయినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రం ఎన్వీ ప్రసాద్, యూవీకి మంచిపేరు తీసుకురావాల'ని అన్నాడు.


Click it and Unblock the Notifications











