twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Darbar Pre Release Event: హిట్టయినా.. ఫ్లాప్ అయినా నవ్వుతూనే.. దర్బార్‌లో ఓ మ్యాజిక్.. రజనీ

    |

    Recommended Video

    Darbar Pre Release Event : Telugu People Only Accepts Good Content Films Says Rajinikanth

    కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తున్నాడు. నేడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్, దర్శకుడు ఏఆర్ మురగదాస్, టాగూర్ మధు, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తదితరులు హాజరయ్యారు. వేదిక వద్దకు రజనీ రాగానే హాలులో అభిమానులు పెద్ద పెట్టున కేరింతలు, అరుపులతో జోష్ పెంచారు. రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేసి వేడుకలో భాగమయ్యారు. ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ..

    దర్బార్ పెద్ద హిట్

    దర్బార్ పెద్ద హిట్

    అందరికీ నా వందనాలు. ఇంత పెద్ద ఫంక్షన్ ఉంటుందని అనుకోలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చేసి లో ప్రొఫైల్‌గా చేస్తారు నిర్మాత ప్రసాద్ గారు. దర్బార్ పెద్ద హిట్ అవుతుందని తెలిసిందేమో.. ఇంత పెద్ద ఫంక్షన్‌ను ఆర్గనైజ్ చేశారు. నాకు నిర్మాత తిరుపతి ప్రసాద్ గారు 20 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఒకే రకంగా ఉంటారు. సినిమా సక్సెస్ అయినా.. ఫ్లాప్ అయినా నవ్వుతూనే ఉంటారు అని రజనీకాంత్ అన్నారు.

    70 ఏళ్ల వయసులో కూడా నటిస్తున్నానంటే

    70 ఏళ్ల వయసులో కూడా నటిస్తున్నానంటే

    నా వయసు 70 ఏళ్లు. నేను ఇంకా హీరోగా నటిస్తున్నానంటే.. మీ ఆశీర్వాదం, ప్రోత్సాహం వల్లే ఇంకా నటిస్తున్నాను. మీ ఎనర్జీ వెనుక సీక్రెట్ ఏంటని చాలా మంది అడుగుతారు. వారికి నేను ఏం చెప్పతానంటే.. తక్కువ ఆశపడండి. తక్కువగా ఆలోచించింది. తక్కువగా తినండి, తక్కువగా నిద్రపోండి.. ఎక్సర్‌సైజ్ చేయండి.. తక్కువగా మాట్లాడండి. ఇవన్నీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు అని రజనీకాంత్ చెప్పారు.

    1976లో నా తొలి సినిమా

    1976లో నా తొలి సినిమా

    1976లో నేను నటించిన అంతులేని కథ రిలీజైంది. నా తొలి తెలుగు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరంతా పుట్టి ఉండరు. అప్పటి నుంచి మీ అభిమానం కొనసాగుతూనే ఉంది. తమిళంలో ఎంతగా అభిమానిస్తారో.. తెలుగులో కూడా అంతే ఉంటుంది. అది నా పూర్వ జన్మ సుకృతం. నా భాగ్యం. నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు మంచి కళా, సినీ ప్రియులు. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు. నేను నటించిన భాషా, చంద్రముఖి, పెదరాయుడు, నరసింహా, రోబో గానీ బాగా ఆడాయంటే.. సినిమాలు బాగా ఉన్నాయనే కారణంతోనే. మంచి సినిమాలో రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి అని రజనీకాంత్ తెలిపారు.

    దర్బార్‌లో అలాంటి మ్యాజిక్

    దర్బార్‌లో అలాంటి మ్యాజిక్

    ప్రతీ సినిమా తీసేటప్పుడు ఓ మ్యాజిక్ ఉంటుంది. అది దొరికినప్పుడు సినిమా బాగా ఆడుతుంది. దర్బార్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అలాంటి మ్యాజిక్ దొరికింది. దర్శకుడు మురుగదాస్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా వేచి చూస్తున్నాను. చివరకు ఇప్పటికి సినిమా కుదిరింది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్. సునీల్ శెట్టి బాగా యాక్ట్ చేశాడు. దర్బార్ సినిమాను నా మిత్రుడు సుభాస్కరన్ నిర్మించారు. సినిమాలు నిర్మించడం ఆయనకు హాబీ. వ్యాపారంతో బిజీగా ఉంటాడు. ఆదిత్య అరుణాచలం అనే ఇన్స్‌పెక్టర్ పాత్రను పోషిస్తున్నాను. ఆ స్టోరి, స్క్రీన్ ప్లే చెప్పిన విధానం వల్లే నిర్మాత దర్బార్‌ను నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ పనితీరు అద్భుతంగా ఉంటుంది అని అన్నారు.

    English summary
    Rajinikanth's Darbar set to release for Sankranti festival. In wake of release, Pre Release Event held at Hyderabad Shilpa Kala Vedika. Rajinikanth, Sunil Shetty are the geust for the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X