Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
దర్బార్ కలెక్షన్ల సునామీ.. దిమ్మ తిరిగే కలెక్షన్లు.. 200 కోట్ల వసూళ్ల దిశగా రజనీ సినిమా
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. కేవలం తమిళనాడులోనే రికార్డుస్థాయి కలెక్షన్లను కొల్లగొడుతున్నది. ఇక ఓవర్సీస్లో రజనీకాంత్ సినిమా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నది, నాలుగు రోజులకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యూఎస్, న్యూజిలాండ్‌లో
దర్బార్ చిత్రం అమెరికాలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ క్లబ్లో చేరడం జరిగింది. ఇలా రజనీకాంత్ చిత్రం 1 మిలియన్ డాలర్ క్లబ్లో చేరడం ఇది 9వసారి. ఇక న్యూజిలాండ్‌లో కేవలం మొదటి రోజునే 19531 డాలర్లను కొల్లగొట్టిన ఈ చిత్రం మూడు రోజల్లో 43771 డాలర్లు వసూలు చేసింది.
ఆస్ట్రేలియా మిగితా దేశాల్లో
దర్బార్ చిత్రం ఆస్ట్రేలియాలో 5 రోజుల్లో రూ.2.10 కోట్లు, యూకేలో రెండు రోజులకు రూ.2.32 కోట్లు, గల్ఫ్ కంట్రీలలో 3 రోజుల్లోనే 3.8 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. అలాగే పలు ద్వీపాల్లో కూడా ఈ చిత్రం రిలీజై భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది.
కలెక్షన్ల సునామీ
తమిళనాడులో దర్బార్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం తమిళంలోనే రూ.100 కోట్ల మార్కును దాటింది. మూడో రోజున ఈ చిత్రం జనవరి 11న తమిళనాడులోనే రూ.30 కోట్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా ఈ చిత్రం నిలకడగా వసూళ్లు సాధిస్తు ఉండటంతో సరికొత్త రికార్డులు వసూలు చేసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో దర్బార్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా... భారీ వసూళ్లే రాబడుతున్నది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.7.57 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాంలో ఈ చిత్రం రూ.3.78 కోట్లు, సీడెడ్‌లో రూ.92 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.78 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.33 లక్షలు, గుంటూరులో రూ.57 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.40 లక్షలు, నెల్లూరులో రూ.29 లక్షలు వసూలు చేసింది.
Recommended Video
ఎంత సాధిస్తే లాభాల్లోకి
దర్బార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.146 కోట్ల మేర బిజినెస్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ.175 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే సుమారు రూ.150 కోట్ల షేర్‌ను సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం తమిళనాడులో లాభాల్లోకి చేరుకొన్నది.