'దరిద్రరత్న..వీడో పెద్ద శనిగాడు' అంటూ దాసరిని
దరిద్రరత్న..వీడో పెద్ద శనిగాడు అనే టైటిల్ ఒకటి రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో నమోదు అయ్యింది.అయితే ఈ టైటిల్ ని దాసరి నారాయణరావుని ఉద్దేశించి చేసారని టాక్ అంతటా స్ప్రెడ్ అయింది.గతంలో నిర్మాత యలమంచిలి రవిచంద్ ఇదే పేరుతో అనటం అందరికి గుర్తుకు వచ్చింది. ఇక దాసరి అంటే గిట్టని వారే ఈ టైటిల్ ని వేరే వారి పేరుతో రిజిస్టర్ చేయించారని చెప్తున్నారు. ఇక దాసరి క్యాంప్ ఈ విషయమై మండిపడుతోంది.రామ్ చరణ్ కీ దాసరికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపధ్యంలో రామ్ చరణ్ క్యాంప్ కు చెందిన వారు ఎవరైనా ఈ పనిచేసి ఉంటారేమో అని అనుమానిస్తున్నారు.
రామ్ చరణ్, దాసరి నారాయణరావుల మద్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్,మాటల యుధ్దం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ గొడవకు మూలం నంది అవార్డుల సమయంలో మొదలైంది. దాసరి మేస్త్రి సినిమా అవార్డులను కొట్టుకుపోయింది. రామ్ చరణ్ తనకు మగధీరతో వస్తుందనుకున్న అవార్డుని సైతం ఆయన పట్టుకెళ్ళిపోయారు. అప్పుటి నుంచి రామ్ చరణ్ తనుకు అవకాశమున్నప్పుడల్లా దాసరి పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తనకు సంభంధం లేని హీరోయిన్స్ కామెంట్ విషయంలోనూ ట్వీట్ చేసి దాన్ని వేడిక్కించారు.ఇప్పుడు ఈ మ్యాటర్ ని కూడా రామ్ చరణ్ ఖాతాలో కలిపేయనున్నారు.


Click it and Unblock the Notifications











