అమ్మ అమ్మే..నాన్న నాన్నే.. పవన్ పవనే
నాకు తొలి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ అమ్మే..నాన్న నాన్నే..పవన్ పవనే. నాకు సినీ జీవితం ఇచ్చిన హీరో కాబట్టి పవన్ అంటే నాకు చాలా అభిమానంఅంటున్నారు దర్శకుడు కరుణాకరన్. ఆయన దర్శకత్వం వహించిన డార్లింగ్ రీసెంట్ గా రిలీజైంది. ఈ సందర్బంగా ఆయన పవన్ కళ్యాణ్ ని తలుచుకున్నారు. దాదాపు పన్నెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్‌కు 'తొలి ప్రేమ' కథ చెప్పి, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బయటికొచ్చిన నాకు హైదరాబాద్ నగరం 'స్వర్గం'లా కనిపించింది. అందుకే నేను తీసే సినిమాల్లో హైదారాబాద్ ని అందంగా చూపించడానికి ఇష్టపడతాను. అఫ్ కోర్స్ భాగ్యనగరం అందంగానే ఉంటుందనుకోండి అన్నారు. ఇక ఈ మధ్యనే ఆయన మరో కథని పవన్ కళ్యాణ్ కి వినిపించి ఓకే చేసుకున్నారు అని వినిపించిన నేపధ్యంలో ఈ స్టేట్ మెంట్ ఆసక్తి రేకిత్తించింది.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ పులి కరుణాకరన్ తొలిప్రేమ డార్లింగ్ ప్రభాస్ కాజల్ pawan kalyan puli karunakaran darling toliprema


Click it and Unblock the Notifications











