డార్లింగ్ ప్రభాస్ ‘నలుగురితో పాటు నారాయణ’ !?
ఇండస్ట్రీలో నలుగురితోపాటు తాను నడుస్తానని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెలవిస్తున్నారు. ఆయన నటించిన డార్లింగ్ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సినిమా విడుదలరోజు విదేశాలలో ఉన్నానని చెప్పారు. రిలీజ్ అంటే ఉండే టెన్షన్‌కు తాను గురయ్యాననీ, అయితే నూన్ షోకే అభిమానులు స్వీట్లు పంచుకోవడం తెలిశాక ఆనందించానని చెప్పారు.
పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అదుపు చేసే పనిలో భాగంగా హీరోలు కూడా తమ పారితోషికాలను తగ్గించుకుంటారా...అని అడిగితే...నలుగురితోపాటే నేను నడుస్తాను. ఎవరు ఏం చేయాలి...అనేది ఎవరికివారు చేస్తుంటారు. నా పని నేను చేస్తాను. నిర్మాతల పని నిర్మాతలు చేస్తారు. మీటింగ్‌లు పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్లు నిర్ణయిస్తారు అంటూ చాకచక్యంగా సమాధానమిచ్చారు.


Click it and Unblock the Notifications











