ఊసరవెల్లి గురించి దర్శకరత్న దాసరి నారాయణ రావు...!?
ఎన్టీఆర్ తాజా చిత్రం 'ఊసరవెల్లి" ఇప్పటికీ బాక్స్ ఆఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది . ఈ సినిమా గత వారాంతంలో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
కాగా నందమూరి అభిమానులకేగాక అఖిలాంధ్ర ప్రేక్షకులు మెచ్చేలా ఉందని ఊసరవెల్లి చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు కితాబిచ్చారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో నిన్న చిత్రం చూసిన దాసరి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. కొంతమంది ఈ చిత్రం సెకండాఫ్ బాగోలేదని అనడంలో అర్థం లేదని అన్నారు. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ కొత్తగా కనిపించాడని...దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. పెద్ద సినిమాల విజయంతో మళ్లీ చిత్ర పరిశ్రమ ఊపిరిపీల్చుకుందన్నారు.
కాగా, నందమూరి కుటుంబంతో దాసరికి మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు స్వర్గీయ ఎన్టీ రామారావు సినీ చరిత్రలోనే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన 'సర్దార్ పాపారాయుడు" చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాసరి నారాయణ రావు గారి తో పాటు 'ఊసరవెల్లి" చిత్ర యూనిట్ సభ్యులంతా ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమాను వీక్షించారు. ఎన్టీఆర్ కు మంచి ఫాలోఇంగ్ ఉన్న బి,సి సెంటర్లలో 'ఊసరవెల్లి" చిత్రం మంచి బిజినెస్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











