twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హత్యాయత్నంలో హీరోకు బెయిల్ నిరాకరణ

    By Srikanya
    |

    కన్నడ సినీ నటుడు దర్శన్‌కు మంగళవారం కోర్టులో చుక్కెదురైంది. భార్య విజయలక్ష్మిపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సమర్పించిన బెయిల్ దరఖాస్తును బెంగుళూరు ప్రథమ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వెంకటేశ్ హులగి తిరస్కరించారు. తొలుత భర్తపైన పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి, అనంతరం మనసు మార్చుకుని తన ప్రకటనను ఉపసంహరించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అభ్యంతరాలు లేనందున దర్శన్‌కు సులభంగా బెయిల్ లభిస్తుందని కొందరు అంచనా వేశారు. అయితే సెషన్స్ కోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకోవచ్చని లేదా హైకోర్టుకు వెళ్లి ఏకంగా కేసునే రద్దు చేయించుకోవచ్చని మేజిస్ట్రేట్ సూచిస్తూ, బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చారు. అలాగే దర్శన్‌పై నమోదు చేసిన ఐపీసీ 307 సెక్షన్ (హత్యాయత్నం)ను ఐపీసీ 324 సెక్షన్ (దాడిలో గాయాలు)గా మార్చడానికి అనుమతి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మెమోను కూడా మేజిస్ట్రేట్ తిరస్కరించారు.

    గత గురువారం రాత్రి భార్యపై దాడి చేసినందుకు గాను స్థానిక విజయ నగర పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆయనను మేజిస్ట్రేట్ నివాసంలో హాజరు పరచగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారు. పోలీసులు ఆయనపై ఐపీసీలోని అయిదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఉబ్బసం, పచ్చ కామెర్లతో బాధ పడుతున్న దర్శన్ ఇక్కడి రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువవుతుందనే ఉద్దేశంతో సుమారు రెండు వందల మంది సాయుధ పోలీసులను ఆస్పత్రి వద్ద మోహరించారు. ముఖ్యులను తప్ప వేరెవరినీ లోపలికి అనుమతించడం లేదు.

    English summary
    Kannada film star Darshan has been refused bail. He was arrested on Friday (September 9, 2011) after he allegedly pulled a gun on his wife, but has been in hospital since Friday itself for respiratory problems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X