twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జడ్జికి లిఖిత పూర్వక హామీ ఇచ్చిన హీరో

    By Srikanya
    |

    కన్నడ హీరో దర్శన్, అతని భార్య విజయలక్ష్మి మధ్య నెలకొన్న కుటుంబ వివాదం ఇక ముగిసినట్లే. ఇకమీదట ఆదర్శ జీవితాన్ని గడుపుతామని దంపతులు హైకోర్టు జడ్జి బీవీ. పింటో ఎదుట లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. భార్యపై దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణపై 28 రోజుల పాటు జైలులో ఉన్న దర్శన్ ఈ నెల ఏడున షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించిన మేరకు దంపతులిద్దరూ గురువారం మధ్యాహ్నం ఆయన ఛాంబర్‌లోకి ప్రవేశించారు.తమ మధ్య ఎటువంటి భిన్నాభిప్రాయాలూ లేవని, కుటుంబ కలతల వల్ల ఆవేదనకు గురయ్యామని న్యాయమూర్తి ఎదుట పేర్కొన్నారు. ఇకమీదట ఆదర్శ జీవనం గడపాలని నిర్ణయించామని తెలిపారు. తమను క్షమించి ఈ కేసు నుంచి విముక్తి కలిగించాలని అభ్యర్థించారు. మున్ముందు ఐక్యంగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

    ఈ దశలో న్యాయమూర్తి దర్శన్‌కు హిత వచనాలు పలికారు. చిత్రాల్లో ఆదర్శ పాత్రల్లో నటించడమే కాదు.. నిజ జీవితంలో కూడా అలాగే మెలగాలని ఉద్బోధించారు. కాగా రాష్ట్ర హైకోర్టు చరిత్రలో సాక్షాత్తు న్యాయమూర్తి భోజన విరామ సమయంలో కక్షిదారులను తన ఛాంబర్‌కు పిలిపించి హితోక్తులు చెప్పడం ఇదే తొలి సారి. న్యాయమూర్తి ఛాంబర్‌లో ఏం జరుగుతుందోననే కుతూహలంతో దర్శన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హైకోర్టుకు తరలి వచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు చాలా మందిని కోర్టు ఆవరణలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఇకమీదట ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయను. భార్యను బాగా చూసుకుంటా అని కన్నడ హీరో దర్శన్ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై కర్ణాటక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ కేసులో ఇరుక్కుని అబాసుపాలైన నిఖిత మాత్రం తనకు దర్శన్ కానీ, అతని భార్య కానీ సారి చెప్పలేదని భాధపడింది.

    English summary
    Kannada actor Darshan, who was granted conditional bail by the Karnataka High Court last week after his arrest on charges of attempt to murder his wife, was counseled by Justice B V Pinto in his chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X