twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ఫ్లాప్ ఐనా హీరోయిన్నుమాత్రం 2కోట్లు ఇచ్చి బుక్ చేసుకొన్నాడట...!

    By Sindhu
    |

    వీర సినిమాతో ప్లాప్ చవిచూసినా కానీ కాజల్ కి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. మగధీర, డార్లింగ్, బృందావనం, మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రాల విజయాలతో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న కాజల్ త్వరలో మహేష్ ది బిజినెస్ మ్యాన్, పవన్ తో గబ్బర్ సింగ్ కూడా చేయబోతోంది. తమిళంలో రెండు భారీ చిత్రాలతో పాటు బాలీవుడ్ లోను మంచి సినిమాతో పున:ప్రవేశం చేస్తున్న కాజల్ డేట్లు సంపాదించాలంటే ఇప్పుడు చాలా కష్టం.

    అయితే డార్లింగ్ కన్నడ రీమేక్ రైట్స్ కొనుకున్న కన్నడ హీరో దర్శన్ ఆ సినిమాలో కాజల్ కావాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆ చిత్ర నిర్మాత అయిన తన సోదరుడితో ఎంతయినా ఇచ్చి కాజల్ డేట్స్ తీసుకురమ్మని పంపించాడు. ప్రస్తుతం కన్నడలో నటించే తీరిక లేదని కాజల్ చెప్పడంతో అతను రెండు కోట్ల పారితోషికం ఆఫర్ చేశాడట. అంత డబ్బు ఒకే సినిమాతో వస్తుందని అనేసరికి కాజల్ కాదనలేకపోయిందట. త్వరలో కాజల్ కన్నడ రంగ ప్రవేశానికి రంగం సిద్దమవుతోంది. ఈ చిత్రానికి 'బుల్ బుల్" అనే పేరు పెట్టారు.

    English summary
    Glamorous Kajal Aggarwal, one of the busiest heroines in the South, is all set to act with Darshan in Bul Bul, but only if her dates match with Darshan?s. Bul Bul is the remake of the Telugu film Darling produced by Challenging Star’s younger brother Dinakar Darshan and a group of technicians comprising director M.D. Sridhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X