రవితేజ ‘దరువు’ ఆడియో ట్రాక్‌లిస్ట్
మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న 'దరువు' మూవీ ఆడియో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ఆల్బంలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. ఆడియో ట్రాక్ కింది విధంగా ఉంది.
1) రాజుల
గానం: దినేష్ కనక రత్నం
రచన: భాస్కర భట్ల రవికుమార్
2) ఉసుమలేరేసే...
గానం: విజయ్ ఆంటోనీ, జానకిలైర్, ఎంసీ జాజ్
రచన: భాష శ్రీ
3) నిజం చెప్పు
గానం: నరేష్ లైర్, సంగీత రాజేశ్వరన్
రచన: భాస్కక భట్ల రవికుమార్
4) సెక్సీ లేడీ
గానం: బెన్నీ డయాల్, ఆండ్రియా జరెమయ్య,
రచన: భాస్కర్ భట్ల రవికుమార్
5) అత్తిలి చిరబరా
గానం: హేమ చంద్ర, అనిత
రచన: రామ జోగయ్యశాస్త్రి
6) తోమ్ తోమ్
గానం: అనంతు
రచన: సుద్దాల అశోక్ తేజ
దరువు చిత్రం రవితేజ మార్కు ఎంటర్ టైన్మెంట్స్‌తో వినోదాత్మకంగా రూపొందుతోంది. గతంలో చిరంజీవి నటించిన 'యముడికి మొగుడు' చిత్రం ఆధారంగా, ఒకరకంగా ఆ చిత్రానికి రీమేక్‌గా దరువు చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. అప్పుడు ఆ సినిమాలో యమ ధర్మరాజుగా కైకాల సత్యనారాయణ నటిస్తే..ఈ చిత్రంలో యంగ్ యమ ధర్మరాజుగా తమిళ నటుడు ప్రభు నటిస్తున్నాడు.
రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ


Click it and Unblock the Notifications











