రవితేజ ‘దరువు’ ఫస్ట్ లుక్ అదిరింది
మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం 'దరువు'(సౌండ్ ఆఫ్ మాస్). రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ చూస్తుంటే రవితేజ మార్కు సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉంటుందని స్పష్టం అవుతోంది. 'నిప్పు' సినిమా ప్లాపవడంతో అభిమానులు 'దరువు' చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ఈచిత్రం షూటింగ్ పూర్తి కానుంది. నిర్మాణానంతర కార్యక్రమాల అనంతరం మే 4న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ


Click it and Unblock the Notifications











