Dasara: నానికి మెంటలా.. ఆ షూటింగ్ కు కూడా వెళ్లలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాడి శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టగా.. అంటే సుందరానికి సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇక హిట్ 2 సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల సందర్భంగా పాల్గొన్న ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నానికి మెంటల్ అనుకున్నా అని డైరెక్టర్ శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 డీ గ్లామర్ లుక్ లో..

డీ గ్లామర్ లుక్ లో..

నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన దసరా సినిమాను పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో మార్చి 30న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మించిన ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించారు.

తెలంగాణలోని ఓ గ్రామం వీరపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని సింగరేణి లోకల్ రైళ్లలో బొగ్గును దొంగలించే యువకుడిగా కనిపించనున్నాడు. అలాగే వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ రోల్ లో ఆకర్షించనుంది.

పర్సనల్ గా ఫీలయ్యా..

పర్సనల్ గా ఫీలయ్యా..

దసరా విడుదల తేది దగ్గర్లో ఉండటంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నాని, కీర్తి సురేష్ తోపాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, దీక్షిత్ పాల్గొన్నారు. ఇందులో నాని ఈ సినిమా ఒప్పుకోవడంపై శ్రీకాంత్ కామెంట్స్ చేశారు. "దసరా సినిమా డైరెక్షన్ టీమ్ తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఒక డిస్కషన్ వచ్చేది.

నేను కూడా చాలా సార్లు అలాగే పర్సనల్ గా ఫీలయ్యా. అరే.. నాని అన్న ఏంటీ అంత సింపుల్ గా సినిమా ఒప్పేసుకున్నాడు. ఆయనకు ఏమన్నా మెంటలా అని డౌట్ వచ్చింది" అని శ్రీకాంత్ చెప్పారు.

ఆరోజు డిసైడ్ అవుతుంది..

ఆరోజు డిసైడ్ అవుతుంది..

శ్రీకాంత్ కొనసాగిస్తూ.. "ఇంత పెద్ద సెటప్, భారీ బడ్జెట్ అందులోనూ నాకు అనుభవం తక్కువ. ఒక్క నాన్నకు ప్రేమతో సినిమాకు అప్రెంటీస్ గా చేసిన ఎక్స్ పీరియన్స్ మాత్రమే ఉంది. అది కూడా పాస్ పోర్ట్ లేకపోవడంతో స్పెయిన్, లండన్ లో జరిగిన షూటింగ్ కు వెళ్లలేదు.

ఇలా ఒక్క సినిమా అనుభవంతో నేను ఈ సినిమా చేయగలనా అని మీకు ఎలా అనిపించింది" అని నానిని అడిగారు. దీంతో తనకు మెంటల్ ఉందో లేదో.. మార్చి 30న ప్రేక్షకులు డిసైడ్ చేస్తారని నాని తెలిపాడు.

మధ్యలో ఆపేయండని..

మధ్యలో ఆపేయండని..

శ్రీకాంత్ చెప్పిన స్టోరీని అంత తొందరగా ఒప్పుకోవడానికి గల కారణాలను కూడా నాని వివరించాడు. "కథ చెప్పే సమయంలో శ్రీకాంత్ నన్ను ఇంప్రెస్ చేయడానికి అస్సలు ప్రయత్నించలేదు. నిజానికి తనకు నేను గంటన్నర మాత్రమే టైమ్ ఇచ్చినప్పటికీ నాలుగు గంటలు నెరేట్ చేశాడు.

అయితే నచ్చకపోతే మధ్యలో ఆపేయండని కూడా ముందే చెప్పాడు. నేను చెప్పుకుంటూ వెళ్తాను. నాకు ఎలా చెప్పాలో తెలియదు అన్నాడు. ఇందులో తన నిజాయితీ నాకు బాగా నచ్చింది" అని నాని చెప్పుకొచ్చాడు.

అంతకుముందే చెప్పాను..

అంతకుముందే చెప్పాను..

"కథ నాకు నచ్చడంతో.. రెండు సీన్లు షూట్ చేసుకు రమ్మని శ్రీకాంత్ కు నేను చెప్పాను. కానీ అతను షూట్ చేసుకుని రాకముందే ఈ సినిమా చేస్తున్నామని వెంకట్ కు ఫోన్ చేసి చెప్పాను" అని నాని తెలిపాడు. ఇలా తను ఈ దసరా స్టోరీ ఓకే చేయడానికి గల కారణాలను ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని నాని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్లు టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X