దసరా టు దీపావళి..సినిమాలే సినిమాలు

By Bojja Kumar

ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌ని పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌ర్ ఆఖ‌రివారం నుండి అక్టోబ‌ర్ ఆఖ‌రి వారం వ‌ర‌కూ స్టార్ హీరో సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రాలలో ఏ సినిమా హిట్ కొడుతుందో.. ఏ చిత్రం ఫ‌ట్టుమంటుందో అని ఎదురు చూస్తున్నారు. ఇక స్టార్ హీరో మ‌హేష్‌బాబు త‌న దూకుడు చిత్రంతో అంద‌రికంటే ముందుగానే వ‌చ్చి హిట్ సాధించాడు.

ఇక ఎన్టీఆర్‌, సురేంద‌ర్‌రెడ్డిల కాంబినేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న చిత్రం ఊస‌ర‌వెల్లి.. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 6న ద‌స‌రా పండుగ‌రోజునే రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లతో దూసుకెలుతోంది. వీటితో పాటు మడతకాజ, పిల్ల జమిందార్, తెలగుమ్మాయి సినిమాలు విడుదలైన థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ మూడు సినిమాల్లో పిల్ల జమిందార్ సినిమా మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న బాడీగార్డ్ చిత్రాన్ని కూడా అక్టోబ‌ర్లోనే రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌ళ‌యాలంలో సూప‌ర్‌స‌క్సెస్ సాధించిన ఈ చిత్రం హిందీలో స‌ల్మాన్ హీరోగా అదే టైటిల్‌తో రూపొంది ఈ మ‌ధ్యే రిలీజ‌యింది. మ‌రి తెలుగులో వ‌స్తున్న ఈ బాడీగార్డ్ ఏమేర‌కు స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి. నాగ‌చైత‌న్య హీరోగా వ‌స్తున్న మాస్ ఓరియంటెడ్ చిత్రం బెజ‌వాడ‌. ఈ చిత్రం టైటిల్ వివాదం న‌డుమ ఈ మ‌ధ్యే టైటిల్ మార్పుచేసుకుని విడుద‌ల‌కి సిద్ద‌మైంది. బెజ‌వాడ నేప‌థ్యంలో సాగిపోతున్న క‌థ‌తో వ‌స్తున్న ఈ చిత్రం నాగ‌చైత‌న్య‌కి స‌క్సెస్ తెచ్చిపెడుతుందా.. లేదా.. అనేది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇక వీటి మ‌ధ్య లోనే గోపీచంద్‌, కృష్ణ‌వంశీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొగుడు, జ‌గ‌ప‌తిబాబు హీరోగా వ‌స్తున్న క్షేత్రం కూడా విడుద‌ల‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి.

బాలయ్య నటించిన శ్రీరామ రాజ్యం సినిమా కూడా దీపావళికి సమీపంలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేయగా, దీపావళి తర్వాత ప్రేక్షకుల ముందుకు ముందుకు రాబోతున్నాడు అక్కినేని నాగార్జున‌.గ్రేటెస్ట్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించ‌డం, రాజ‌మౌళి ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్ల‌ని ప్రత్యేకంగా రూపొందించ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో నాగార్జున విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.. మ‌రి ఈ చిత్రం ఏమేర‌కు స‌క్సెస్ సాధిస్తుందో అన్న‌ది చూడాలి. ఒకే నెల‌లో ఒకేసారి ఇంత‌మంది స్టార్ హీరోల చిత్రాలు రావ‌డం అభిమానులు పూర్తి పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X