2 రోజులు ‘దసరా’ విలన్ హైడ్రామా.. డ్రగ్స్ కేసులో పోలీసులకు లొంగిపోయిన నటుడు

టాలీవుడ్ లో కొద్ది రోజుల కింద డ్రగ్స్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల బెట్టింగ్ యాప్స్, ఐటీ రైడ్స్ తోనూ ఇండస్ట్రీలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ తాజాగా 'దసరా' నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో దొరికిపోవడం సంచలనంగా మారింది. గతంలో ఆయనపై ఓ డ్రగ్స్ కేసు నమోదైంది. కానీ ఆయనకు కోర్టు నుంచి నిర్దోషిగా తీర్పు వెల్లడైంది. ఆయన డ్రగ్స్ సేవించారని పలు ఆరోపణలు తరుచూగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

అయితే తాజాగా దసరా నటుడు షైన్ టామ్ చాకో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ సెట్స్ లో డ్రగ్స్ సేవించడాని, పైగా హీరోయిన్ విన్సీ సోనీ అలోషియస్స్ తో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నటి విన్సీ సోనీ, షైన్ టామ్ చాకోతో కలిసి మలయాళ చిత్రం 'సూత్రవాక్యం' అనే సినిమాలో నటించారు. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో తనను అసభ్యంగా తాకడాని నటి ఆరోపించింది. అంతేకాకుండా మలయాళ నటి విన్సీ సోనీ ఏకంగా కేరళ ఫిల్మ్ ఛాంచర్ తో పాటు ఎర్నకులమ్ నార్త్ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు కూడా చేసింది.

Dasara movie actor Shine Tom Chacko surrenders to police

అంతేకాకుండా అమ్మ అసోసియేషన్ కు కూడా నటి ఫిర్యాదు చేయడంతో విషయం సీరియస్ అయ్యింది. దీంతో వారు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ విన్సీ సోనీ ఫిర్యాదు చేసిన సమయంలో నటుడు షైన్ టామ్ చాకో మరో హోటల్ లో డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా సమాచారం అందింది. దాంతో హోటల్ కు రైడ్ కు వెళ్లిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి దూకేశాడు. పోలీసులకు దొరకకుండా అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే అతనిని విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో షైన్ టామ్ చాకో ఇంట్లో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు నోటీసులు తీసుకున్నారు. ఇక రెండ్రోజులుగా విచారణకు మాత్రం అతను హాజరు కాలేదు. దీంతో పోలీసులు తీవ్రంగా గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో షైన్ టామ్ చాకోనే వచ్చి పోలీసులకు లోంగిపోయారు. తాజాగా ఎర్నకులమ్ టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ లో నటుడు షైన్ టామ్ చాకో పోలీసుల అదుపులో ఉన్నారు.

పోలీసులు అతన్ని విచారించడం కోసం 32 ప్రశ్నలను సిద్ధం చేశారు. కానీ తప్పించుకు తిరగడంతో విచారణ ఆలస్యమైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. రెండు రోజులు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగాడు. దీంతో అతని జాడ కోసం మరింత ఫోర్స్ ను దింపడంతో దారిలేక అతనే వచ్చి లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇతను నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' చిత్రంలో విలన్ పాత్రలో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ 'దేవర', అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X