Srikanth Odhela: పెళ్లి చేసుకున్న దసరా డైరెక్టర్.. అంగరంగ వైభవంగా వేడుక!
టాలీవుడ్ లో చాలా మంది దర్శకులుగా సక్సెస్ కావాలని కోటి ఆశలతో అడుగుపెడతారు. ఆరంభంలో అవాంతరాలు ఎదురైన తరువాత సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. అలాగే డిగ్రీ పూర్తి చేసి డైరెక్టర్ అవ్వాలని హైదరాబాద్ లో అడుగుపెట్టిన గోదావరిఖని కుర్రాడు సుకుమార్ ని మెప్పించి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.
అతనే శ్రీకాంత్ ఒదేల. దసరా మూవీతో మొదటి చిత్రంతో ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకొని మొదటి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేసాడు. సుకుమార్ టీమ్ లో మిగిలిన ఎవరికీ సాధ్యం కాని రికార్డు తన పేరు మీద క్రియేట్ చేసుకున్నాడు. దసరా మూవీతో శ్రీకాంత్ ఒదేల సక్సెస్ అందుకోవడం అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ప్రస్తుతం ఈ కుర్ర దర్శకుడితో సినిమాలు చేయడం కోసం బడా నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అఖిల్ అక్కినేని హీరోగా ఒక సినిమా చేసే ప్లాన్ లో శ్రీకాంత్ ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉందంట. బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీ ఉండబోతోందని టాక్ నడుస్తోంది. అయితే ఎప్పుడు దీనిపై క్లారిటీ వస్తుందనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యంగ్ దర్శకుడు పెళ్లి పీటలెక్కాడు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ పెళ్లికి నేచురల్ స్టార్ నాని కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే మొన్నటి వరకు ముంబై లో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొని పూర్తి చేసిన నాని తాజాగా పూణేలో యాడ్ ఫిల్మ్ కోసం వెళ్ళారు. దీంతో శ్రీకాంత్ ఒదేల పెళ్ళికి హాజరు కాలేకపోయాడు. అయితే అతనికి ప్రత్యేకంగా విషెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ కూడా శ్రీకాంత్ కి స్పెషల్ గా విషెస్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











