Dasara దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. శ్రీకాంత్ ఓదెలకు ఎన్ని కోట్ల బహుమతి అంటే?
నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద దసరా సినిమాతో ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్టర్ చేసిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులకు కానుకలు కూడా అందుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడికి చిత్ర నిర్మాత ఖరీదైన కానుక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దాని రేటు ఎంత అనే వివరాల్లోకి వెళితే...

బిగ్గెస్ట్ ఒపెనింగ్స్
నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ లవ్ స్టోరీలు యాక్షన్ డ్రామా సినిమాలు చేశాడు. కానీ మొదటిసారి ఊహించని విధంగా అతను కంప్లీట్ ఊర మాస్ జానర్లో దసరా అనే సినిమా చేసిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మొదటి రోజే నాని కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ధరణి పాత్రలో నాని నటించిన విధానం కూడా అద్భుతంగా ఉంది అని పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి.

సుకుమార్ శిష్యుడు
ఇక దసరా సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇంతకుముందు సుకుమార్ దగ్గర సహాయక దర్శకుడిగా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో సినిమా దగ్గరనుంచి సుకుమార్ దగ్గర చేసుకుంటూ వచ్చిన శ్రీకాంత్ 2018 నుంచే దర్శకుడిగా మారాలి అని తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇక అతను మొదటి కథను కూడా నానికి వినిపించాడు.

నాని నమ్మాడు.. కానీ..
ఇక దసరా సినిమా కథను విన్న నాని, శ్రీకాంత్ ను నమ్మాడు కానీ ముందుగా కొన్ని సన్నివేశాలను షూట్ చేసుకునే రావాలి అని చెప్పాడట. ఇక శ్రీకాంత్ కొన్ని ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేసి చూపించగా అవి నానికి చాలా బాగా నచ్చాయి. దీంతో వెంటనే దసరా సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి దాదాపు 65 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్లుగా తెలుస్తోంది.

100 కోట్ల దిశగా..
ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా మిగతా భాషల్లో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఓవర్సీస్ లో కూడా అతివేగంగా నాని 1 మిలియన్ మార్కును చేరుకోవడం విశేషం. చూస్తుంటే ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

దర్శకుడికి కానుక
ఇక సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో చిత్ర నిర్మాత సుధాకర్ దర్శకుడికి ఒక ఖరీదైన కానుక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు 80 లక్షల విలువ చేసే బిఎండబ్ల్యూ కారును దర్శకుడికి కానుకగా ఇచ్చారట. అయితే ఆ కారు ఖరీదు కోటి రూపాయలకు పైగానే ఉంటుంది అనే విధంగా సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మిగతా వారికి గోల్డ్ కాయిన్స్
అంతేకాకుండ సినిమాకు ఎంతగానో హార్డ్ వర్క్ చేసినా మరి కొంతమంది టెక్నీషియన్స్ కి కూడా కొన్ని గోల్డ్ కాయిన్స్ ను కూడా కానుకగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిర్మాత సుధాకర్ కు ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు దక్కలేదు. కానీ ఈ సినిమాతో మాత్రం ఆయన పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ సినిమాకు పనిచేసిన వారికి ఆయన కానుకలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











