twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్టర్ ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ లో వెంకీ-గోవా బ్యూటీ...

    By Sindhu
    |

    మొదటి నుంచీ కూడా హీరో వెంకటేష్‌ తన సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్‌ బాగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన అభిమానుల్లో మహిళలే ఎక్కువగా ఉంటారని వెంకీ నమ్మకం. చూపించే సబ్జెక్ట్ కూడా వారిని అలరించేలా ఉండాలని కోరుకుంటాడు. మిస్టర్‌ ఫర్‌ ఫెక్ట్ మన్మధుడు సంతోషం...వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ లవ్‌స్టోరీస్‌ చక్కగా డీల్‌ చేసిన దర్శకుడు దశరథ్‌ పై వెంకీ దృష్టి పడింది.

    దాంతో అతనితో ఓ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాడు. తనకు సరిపోయే సబ్జెక్ట్ చేయమని వెంకటేష్‌ పిలిచి మరీ చెప్పాడంట. దశరథ్‌ కూడా 'మిస్టర్‌ ఫర్‌ ఫెక్ట్‌' విజయానందంలో ఉన్నాడు. దాంతో రెట్టించిన ఉత్సాహంతో స్క్రిప్ట్ తయారు చేయటంలో మునిగిపోయాడు. త్వరలో ఇది కూడా పూర్తవుతుందని షూటింగ్‌ సైతం ప్రారంభించనున్నారని తెలుస్తోంది. సింహా వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన పరుచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. నిర్మాత పరుచూరి ప్రసాద్ ప్రస్తుతం రాణా, జెనీలియాలతో చేస్తున్న 'నా ఇష్టం" చిత్రం పూర్తికాగానే వెంకటేష్ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారు.

    ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా, సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి. అయితే ఇందులో గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోవడం దాదాపు ఓకే అయినట్టు సమాచారం! ప్రస్తుతం త్రిషతో బాడీగార్డ్ చిత్రంతో వెంకటేష్ బిజీగా ఉన్నారు.

    English summary
    Victory Venkatesh is all set to act in a mythological comedy film. As per the Film Nagar buzz Venkatesh agreed to act in a mythological film which will be directed by Dasarath. If every thing goes fine, Ileana would be heroine and Prakash Raj will play the role of Lord Bramha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X