twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు మీద కేసు: అసలు విషయం వెల్లడించిన దర్శకుడు!

    దిల్ రాజు మీద రచయిత శ్యామలారాణి కాపీరైట్ కేసు వేశారు. మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ కథ తన నవల కాపీ అనేది ఆమె ఆరోపణ.

    By Bojja Kumar
    |

    ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కాపీరైట్ చట్టం కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రచయిత శ్యామలా రాణి మియాపూర్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తన రచనను కాపీ కొట్టి 'మిస్టర్ ఫర్‌ఫెక్ట్' సినిమాను తెరకెక్కించారు అనేది ఆమె ఆరోపణ.

    ఈ వివాదంపై 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్ర దర్శకుడు దశరథ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రచయిత శ్యామలా రాణి ఆరోపణలను ఆయన ఖండించారు. కథ వెనక ఉన్న అసలు విషయాలు ఆయన వెల్లడించారు.

    నవల రావడానికి ముందే కథ రిజస్టర్ చేయించాం

    నవల రావడానికి ముందే కథ రిజస్టర్ చేయించాం

    శ్రీమతి శ్యామలారాణి గారు (వయసు 63 సం.) తను రాసిన ‘నా మనసుకోరింది నిన్నే' అనే నవలని 2010 ఆగస్టులో రిలీజ్ చేశారని, ఆ నవలలో ఉన్న కథని తీసుకుని ‘మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమా తీశారని కేసు వేశారు. అయితే ఆ నవల రిలీజ్ అవటానికి 18 నెలల ముందే 2009, ఫిబ్రవరి 19న ‘మిస్టర్ పర్‌ఫెక్ట్' కథని ‘నవ్వుతూ' అనే టైటిల్ తో రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది.... అని దశరథ్ తెలిపారు.

    2008లోనే ప్రభాస్‌కు కథ చెప్పాం

    2008లోనే ప్రభాస్‌కు కథ చెప్పాం

    ఆ నవల రిలీజ్ అవ్వడానికి రెండు సంవత్సరాల ముందే 2008 డిసెంబర్ లో నేను, దిల్ రాజుగారు కలిసి మలేషియా వెళ్లి ‘బిల్లా' మూవీ షూటింగులో ఉన్న ప్రభాస్‌కు మిస్టర్ పర్ ఫెక్ట్ కథ చెప్పడం, ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది... అని దశరథ్ తెలిపారు.

    ఆమె వినిపించుకోవడం లేదు

    ఆమె వినిపించుకోవడం లేదు

    ఈ విషయాన్ని రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పరుచూరి గోపాలకృష్ణ గారు శ్యామల గారికి ఆరు నెలల క్రితమే వివరించారు. అయినా ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరం... అని దశరథ్ అన్నారు.

    నిజాలను గ్రహించండి

    నిజాలను గ్రహించండి

    రైటర్ శ్యామలారాని గారు నిజాలని ఇప్పటికైనా గ్రహించాలని కోరుతున్నాను..... అని దశరథ్తెలిపారు. అయితే శ్యామలారాణి మాత్రం కోర్టులో ఈ విషయమై పోరాడుతున్నారు.

    ప్రేక్షకుల్లో సందేహం

    ప్రేక్షకుల్లో సందేహం

    ఈ కేసు విషయం విన్న ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడో 2011లో సినిమా వస్తే ఇపుడు కేసు వేయడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారు.

    కేసు ఆలస్యానికి కారణం...

    కేసు ఆలస్యానికి కారణం...

    అయితే రైటర్ శ్యామలారాణి 2011లో సినిమా విడుదలైనపుడు చూడలేదట. 2013లో ఈ సినిమా టెలివిజన్ వస్తుంటే చూశారట. చాలా సన్నివేశాలు, డైలాగ్స్ నా పుస్తకంలోనివే అన్నట్టు ఉండటంతో ఆమె న్యాయనిఫులను సంప్రదించారట.

    నోటీసులు

    నోటీసులు

    కొన్ని రోజుల క్రితమే ఈ విషయమై శ్యామలారాని నిర్మాతలకు నోటీసులు పంపినట్లు సమాచారం. వారి నుండి సరైన స్పందన రాక పోవడంతో కేసు పెట్టారు. మియాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజు, సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మన్, దర్శకుడు దశరథ్, మాటల రచయిత అబ్బూరి రవిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. వీరిపై ఐపీసీ సెక్షన్ 120 బీ (కుట్ర), 420 (చీటింగ్) కింద కేసు నమోదు చేశామని మియాపూర్ పోలీసులు తెలిపారు.

    English summary
    It is known that a novelist named Shyamala Rani has filed a case on producer Dil Raju on the charges of plagiarism alleging that her novel 'Naa Manasu Ninnu Kori' has been copied for Prabhas film 'Mr. Perfect'. Meanwhile, 'Mr. Perfect' director Dasarath responded with a letter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X