పూరీ, వర్మ ఇద్దరూ అడ్డదారిలోనే...దాసరి
అసలు పూరీ, వర్మ ఇద్దరూ అడ్డదారిలో పోతున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తేనే దర్శకుడు క్లిక్ అయ్యేది. 'ఇడియట్'తో హీరో క్యారెక్టర్‌ను అడ్డదిడ్డంగా చూపించాడు. ఆ క్యారెక్టర్లే హీరోలంతా చేస్తున్నారు అని ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. అలాగే దర్శకుడు పేరుచెబితేనే క్లాప్స్ కొట్టే స్థాయికి పూరీ ఎదిగాడు. మహేష్‌లో మెచ్చూరిటీ చాలా వచ్చింది. ఆయన లుక్స్ ఈ సినిమాలో బాగా మెయింటైన్‌చేశాడు. ఇక కాజల్‌కు నిజంగా నటన రాదు. క్రమేణా మెరుగుపర్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు విలువేలేదు. కానీ దర్శకుడు తెలివిగా దాన్ని మలిచాడు అన్నారు.
బిజినెస్ మ్యాన్ గురించి చెపుతూ.. 'బిజినెస్‌మేన్'లో మహేష్ బాబు చేసిన పాత్ర చాలా క్లిష్టమైంది. 'ఫూల్ ఔర్ పత్తర్'లో థర్మేంద్ర పోషించిన ప్రేమికుడిగా, 'జంజీర్'లో అమితాబ్ బచ్చన్ చేసిన యాంగ్రీ యంగ్‌మేన్ పాత్రను కలిపితే మహేష్ బాబు చేసిన పాత్ర అది. దీని తర్వాత మహేష్‌కు క్యారెక్టర్లు క్రియేట్ చేయడం కష్టమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం సూపర్ హిట్టవటంతో ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఈ చిత్రం మీదే ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు. అలాగే పూరీ జగన్నాధ్ ..రవితేజతో దేవుడు చేసిన మనుష్యులు చిత్రం ప్లాన్ చే్స్తున్నారు.


Click it and Unblock the Notifications











