twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి దత్తత, సాయి కొర్రపాటి టీం బియ్యం పంపిణీ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితుల కోసం సహాయం అందించేందుకు పలువురు స్టార్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్స్ అందరూ లక్షలాది రూపాయల విరాళాలు అందించారు. తాజాగా ఈ లిస్టులో దాసరి నారాయణరావు కూడా చేరారు. ఆయన తుఫాన్ వల్ల అన్నీ కోల్పోయిన మూడు కుటుంబాలను దాసరి దత్తత తీసుకుని, వారికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలుస్తోంది. వారు ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు అండగా ఉంటానని దాసరి మాట ఇచ్చారట.

    హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి 100 టన్నుల బియ్యాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బియ్యాన్ని ఆయన స్వయంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుఫాన్ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించి బియ్యం పంపిణీ చేయనున్నారు.

    Dasari adopts Hudhud affected Families

    సోమవారం నుండి విశాఖలో ప్రారంభం కానున్నఈ మహత్తర కార్యక్రమంలో సాయి కొర్రపాటితో పాటు ‘ఊహలు గుసగుసలాడే' చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల, హీరోయిన్ రాశిఖన్నా, దిక్కులు చూడకు రామయ్యా దర్శకుడు త్రికోఠి, నటుడు అజయ్, బ్రహ్మాజీ పాలుపంచుకోనున్నారు.

    విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లల్లో తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఈ బియ్యం బస్తాలు చేరడమే ప్రధాన ఆశయంగా సాయి కొర్రపాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారాహి యూనిట్ పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

    English summary
    According to the reports instead of donating cash to relief fund Dasari has adopted three families which were victimized by the recent cyclone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X