సలోనిని టార్గెట్ చేసి దాసరి కామెంట్
గతంలో యువ హీరోలు, హీరోయిన్స్ పై విరుచుకుపడ్డ దాసరి మరోసారి సలోని పై వాగ్భాణాలు విసిరారు.ఆయన తాజాగా తెలుగు అమ్మాయి ఆడియోకు హాజరై సలోనిని కామెంట్ చేయటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. హీరోయిన్స్ కి పొగరు తలెకెక్కుతోందని అన్నారు. అదే ఫంక్షన్ కి హాజరైన కోడి రామకృష్ణ మాట్లాడుతూ సలోనిని సౌందర్యని రీప్లేస్ చేయటానకి వచ్చినట్లుందని అన్నారు. అలాగే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు సలోని..ఎందుకంటే ఒకప్పుడు సౌందర్య అటు సెంటిమెంట్ అటు యాక్షన్, ఇటు గ్లామర్ అన్నీ పండించేది..మళ్ళీ సౌందర్యని రీప్లేస్ చేయటానకి వచ్చిన అమ్మాయిగా సలోని అనిపించింది అన్నారు.
కోడి రామకృష్ణ తర్వాత అదే పంక్షన్ లో మాట్లాడిన దాసరి, కోడి రామకృష్ణ మాటలను తప్పు పట్టారు. ఆయన మాట్లాడుతూ..ఇందాక మావాడు రామకృష్ణ ..సలోనిని సౌందర్యతో పోల్చాడు. అంతవరకూ వద్దు అప్పుడే. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు మన నెత్తిమీదకు ఎక్కేసారు అని వ్యాఖ్యానించారు. ఆమె మంచి నటి వరకూ ఓకే కానీ సౌందర్య ప్లేస్ భర్తీ చేస్తుందనద్దు అన్నారు. గతంలోనూ దాసరి ఓ అవార్డు పంక్షన్ కి హాజరై హీరోయిన్స్ పద్దతులను తప్పు పట్టారు.


Click it and Unblock the Notifications











