‘స్వామి రారా’కి ఓ పెద్ద సినిమా అన్యాయం చేసింది: దాసరి
అలాగే ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. ఈ చిత్రం ద్వారా సుధీర్‌వర్మ మరోసారి ఆ విషయాన్ని నిరూపించాడు. నిఖిల్, స్వాతి అద్భుతంగా నటించారు. ఇలాంటి ఒక కథాంశంతో సినిమా తీసిన నిర్మాతలను మెచ్చుకోవాలి అని అన్నారు.
ఇక ''ఆరు ఫైట్లు, పాటలు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు... ఇలా ఓ మూస ధోరణిలో మన సినిమాలు ఉంటున్నాయి. కానీ మలయాళం, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో అలా కాదు. చిన్న సినిమాలను అక్కడ ఎంతో బాగా తీస్తున్నారు. ఆ కోవలో సుధీర్‌వర్మ ఈ చిత్రం చేసిన విధానం కొత్తగా ఉంది'' అని చెప్పుకొచ్చారు రు డా. దాసరి నారాయణరావు.
దర్శకుడు మాట్లాడుతూ,,, ''నిఖిల్‌కి కథ చెప్పకపోయినా, నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ఈ చిత్రవిజయం యూనిట్ మొత్తానికి దక్కుతుంది'' అని చెప్పారు. ''సుధీర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా హిట్ అయ్యింది కాబట్టి, దీన్ని నిలుపుకునే విధంగా తదుపరి చిత్రాలు ప్లాన్ చేసుకోమంటున్నారు. అలాగే చేస్తా'' అని నిఖిల్ అన్నారు.


Click it and Unblock the Notifications












