twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘స్వామి రారా’కి ఓ పెద్ద సినిమా అన్యాయం చేసింది: దాసరి

    By Srikanya
    |

    హైదరాబాద్ :''ఓ పెద్ద సినిమా కోసం బాగా ఆడుతున్న ఈ చిన్న సినిమా 'స్వామి రారా'ని థియేటర్ల నుంచి తీసేశారు. ఇది అన్యాయం. అదే నా చేతిలో కనుక ఈ సినిమా ఉండి ఉంటే 25 సెంటర్లలో వంద రోజులాడి ఉండేది అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు అన్నారు. శంకర్ చిగురుపాటి సమర్పణలో నిఖిల్, స్వాతి జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన 'స్వామి రారా' యాభై రోజుల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఇలా స్పందించారు.

    అలాగే ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. ఈ చిత్రం ద్వారా సుధీర్‌వర్మ మరోసారి ఆ విషయాన్ని నిరూపించాడు. నిఖిల్, స్వాతి అద్భుతంగా నటించారు. ఇలాంటి ఒక కథాంశంతో సినిమా తీసిన నిర్మాతలను మెచ్చుకోవాలి అని అన్నారు.

    ఇక ''ఆరు ఫైట్లు, పాటలు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు... ఇలా ఓ మూస ధోరణిలో మన సినిమాలు ఉంటున్నాయి. కానీ మలయాళం, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో అలా కాదు. చిన్న సినిమాలను అక్కడ ఎంతో బాగా తీస్తున్నారు. ఆ కోవలో సుధీర్‌వర్మ ఈ చిత్రం చేసిన విధానం కొత్తగా ఉంది'' అని చెప్పుకొచ్చారు రు డా. దాసరి నారాయణరావు.

    దర్శకుడు మాట్లాడుతూ,,, ''నిఖిల్‌కి కథ చెప్పకపోయినా, నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ఈ చిత్రవిజయం యూనిట్ మొత్తానికి దక్కుతుంది'' అని చెప్పారు. ''సుధీర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా హిట్ అయ్యింది కాబట్టి, దీన్ని నిలుపుకునే విధంగా తదుపరి చిత్రాలు ప్లాన్ చేసుకోమంటున్నారు. అలాగే చేస్తా'' అని నిఖిల్ అన్నారు.

    English summary
    Swamy Ra Ra film completed 50 days in 25 centers with good profit-share. Dasari attended as the chief guest and congratulated the team members for the success. He said " I liked Swamy Ra Ra personally as it was shot in complete different style as compared with the other Telugu movies. Infact i am disappointed with the way it got the response from the distributors. If is had released the movie i would take all care in making it complete 100 days in 25 centers."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X