‘పూల రంగడు’కి దాసరి ప్రశంసలు
సునీల్-ఇషా చావ్లా జంటగా పూల రంగడు సినిమా రూపొందిన విషయం తెసిందే. వీరభద్రం దర్శకత్వం వహించిన ఈచిత్రం విజయవంతంగా దూసుకెలుతోంది. ఆర్ఆర్ మూవీమేకర్స్ సమర్పణలో అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రంపై దర్శక రత్న దాసరి ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా బాగుతుందని, సునీల్ కెరీర్లోనే ఈచిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన అన్నారు. దర్శకుడు వీరభద్రం సినిమాను వినోదాత్మకంగా చాలా బాగా తెరకెక్కించారని ప్రశంసించారు.
కాగా..పూలరంగడు హిట్ తో సునీల్ రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కమిడియెన్ నుంచి సిక్స్ ప్యాక్ పెంచి మరీ యాక్షన్ హీరోగా మారాడు సునీల్. పూల రంగడు విజయంతో సునీల్ తో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం అతని సిక్స్ ప్యాక్ కి,డాన్స్ లకే దక్కటం అతన్ని సంతోషంలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పూలరంగడు హిట్ తో ఈ చిత్ర దర్శకుడు వీరభద్రమ్ తన తదుపరి చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ చిత్రం టైటిల్ 'భాయ్'."ఎంటర్‌టైన్‌మెంట్‌తో చంపేస్తాడు..అనేది ఆ సినిమా ట్యాగ్‌లైన్. ఇక 'భాయ్'కి వీరభద్రమ్ గత రెండు చిత్రాలకు రచన చేసిన శ్రీధర్ సీపాన రచయితగా చేస్తున్నారు. ఆయనే ఈ ప్రాజెక్టుని విషయం మీడియాకు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు నాగార్జునతో తెరకెక్కనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











