Don't Miss!
- News ఏపీలో కూటమి కోసం ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దాసరి ఇంట్లో ఆస్తుల కుమ్ములాట.. గోడ దూకితే తప్పేంటి.. దాసరి అరుణ్
దర్శకరత్న దాసరి నారాయణరావు ఆస్తికి సంబంధించిన వివాదం ఎంతగా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కుమారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు చేరారు. నిన్న దాసరి పెద్ద కొడుకు ప్రభు.. తన తమ్ముడు దాసరి అరుణ్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇంట్లోకి దొంగలా దూరాడని, దూర్భషలాడాడని, కొట్టాడని పోలీసుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దాసరి అరుణ్ మీడియాతో మాట్లాడుతూ ఆ ఆరోపణలు ఖండించాడు. ఇంతకీ ఆయన చెప్పిన వివరాలు ఏంటో ఓ సారి చూద్దాం.
దాసరి ఆస్తి కోసం..
దాసరి నారాయణ రావు తన తదుపరి వీలునామా విషయంలో మురళీ మోహన్, మోహన్ బాబు, సీ కళ్యాణ్ వంటివారు చూసుకోవాలని తెలిపాడు. అయితే వీరి మధ్య వర్తిత్తం పని చేయలేదు. ఇప్పటికీ దాసరి కొడుకులు ఆస్తి కోసం రోడ్డు మీదకు వచ్చారు. తాజాగా పోలీసు స్టేషన్ వరకు చేరింది.
ఆ ఇంటి కోసమే..
జూబ్లీహిల్స్‌లోని దాసరి ఇంటి కోసమే ఈ గొడవలు జరుగుతున్నాయి. అప్పట్లో దాసరి అందులోనే ఉండేవారు. ఆ ఇల్లు నాదంటే నాదంటూ.. ఇద్దరు కొడుకులూ తగువులాడుకుంటున్నారు. నిజానికి ఆ ఇల్లు ప్రభు కూతురి పేరు మీద ఉంది. ప్రస్తుతం ఆ ఇంటి చుట్టూనే వివాదం నడుస్తోంది. ఈ నెల 24న గోడదూకి ఇంట్లోకి వచ్చాడని, కుటుంబ సభ్యులను,తనను తిట్టాడని కొట్టాడని ప్రభు ఫిర్యాదు చేశాడు.
స్పందించిన అరుణ్..
తన అన్న చేసిన ఆరోపణలపై దాసరి అరుణ్ మీడియాతో మాట్లాడాడు. ఈ నెల 24న గోడ దూకి ఇంటికి వెళ్లింది నిజమేనని తెలిపాడు. ఇటీవల తనకు ఓ కొరియర్ వచ్చిందని. తీసుకోవడానికి వెళ్లానని పేర్కొన్నాడు. బెల్ కొడితే డోర్ తీయలేదని.. అందుకే గోడ దూకానని పేర్కొన్నాడు. లోపలి వెళ్లాక ప్రభు వచ్చాడని, నా డాక్యుమెంట్ ఇస్తే వెళ్లిపోతానని చెప్పానని అన్నట్టు తెలిపాడు. కానీ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసుల ముందే తన డాక్యుమెంట్ తీసుకొని వెళ్లానని వెల్లడించాడు.
గోడ దూకితే తప్పేంటి..
తన ఇంట్లో తాను గోడ దూకితే తప్పేంటని ప్రశ్నించారు. తాను మద్యం తాగి గోడదూకితే పడిపోవాలి కదా? అని చెప్పుకొచ్చాడు. పోలీసుల ముందు కొడితే అప్పుడే అరెస్ట్ చేసేవాళ్లు కదా? అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రభు ఉంటున్న ఇల్లు ముగ్గురిదని, మా సోదరితో పాటు తనకు దాంట్లో పొత్తు ఉందని అన్నాడు. అన్నయ్యకు, నాకు, సోదరికి ఎలాంటి వివాదాల్లేవని స్పష్టం చేశాడు. ఆయన డిప్రెషన్లో ఉన్నాడని, అందుకే ప్రతిసారి మీడియా, పోలీసుల దగ్గరకు వెళ్తున్నాడని తెలిపాడు. ఆస్తి వివాదంపై సినీ పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కరిస్తామంటే తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడు.