థ్రిల్లర్ చిత్రాల శేఖర్ సూరి నెక్ట్స్..

By Srikanya

ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంతో ఒక్క సారిగా పరిశ్రమను తన వైపుకు త్రిప్పుకున్న దర్శకుడు శేఖర్ సూరి. ఆయన తాజాగా దాసరి అరుణ్ కుమార్ హీరోగా ఓ ధ్రిల్లర్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో రూపొందించిన త్రి చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వటంతో ఈ సారి ఎలాగయినా హిట్ కొట్టాలనే ఆకాంక్షతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులను షాక్ కు గురిచేసే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. అందులోను రవిబాబు రాకతో ధ్రిల్లర్స్ కి మంచి టైమ్ వచ్చినట్లే భావిస్తున్నారు. ఇక దాసరి కుమారుడు అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తర్వాత చాలా చిత్రాలు చేసినా ఫలితం లేదు. చివరగా హైదరాబాద్ బాంబ్ ప్రేలుళ్లు నేపద్యంలో రూపొందిన ఆదివిష్ణు కూడా కాపాడలేకపోయింది. దాంతో అరుణ్ కూడా ఈ కొత్త ప్రాజెక్టు పైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచీ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X