ఆస్తి గొడవలు మళ్లీ తెరపైకి.. చంపుతానని బెదిరింపులు.. దాసరి అరుణ్‌పై కేసు పెట్టిన ప్రభు

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన దాసరి నారాయణ రావు ఇంటికే పెద్ద సమస్య వచ్చి పడింది. దాసరి మరణానంతరం ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవలు ఇంకా వివాదాంగానే ఉన్నాయి. త‌న త‌ద‌నంత‌రం ఆస్తిపంప‌కాలు చేయాల్సిందిగా ఆ బాధ్య‌త‌ని ముర‌ళీమోహ‌న్‌, మోహ‌న్ బాబు, సి. క‌ల్యాణ్‌కి అప్ప‌గిస్తూ వీలునామా రాశాడట. అయితే వారు చేసిన ప్రయత్నాలన్నీ ఆ మధ్య బెడిసి కొట్టాయి. తాజాగా మళ్లీ వీరిద్దరి వ్యవహారం రచ్చకెక్కింది.

ఆస్తి వివాదాలు..

ఆస్తి వివాదాలు..

దాస‌రికి ఇద్ద‌రు త‌న‌యుడు. ఒక‌రు ప్ర‌భు, మ‌రొక‌రు దాస‌రి అరుణ్ కుమార్‌. వీరిద్ద‌రి మ‌ధ్య ఆస్తికి సంబంధించిన గొడ‌వ‌లు ముందు నుంచీ ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించేందుకు సినీ పెద్దలు ప్రయత్నించినా అవి వ్యర్థమయ్యాయి. అయితే మరోసారి వీరి వ్యవహారం వివాదాస్పందగా మారింది.

ఇంట్లోకి చొరబడి..

ఇంట్లోకి చొరబడి..

దాసరి అరుణ్ ఈ నెల 24న రాత్రి తన ఇంటి గేటును దూకి లోపలకు ప్రవేశించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రభు మాట్లాడుతూ.. అరుణ్ ఆ సమయంలో బాగా తాగేసి ఉన్నాడని తనను, తన భార్యను, అత్తామామలను దారుణంగా తిడుతూ, కొట్టాడని చెప్పుకొచ్చాడు. అరుణ్ భార్య కూడా దుర్భాషలాడిందని తెలిపాడు. పోలీసుల ముందు కూడా దాడి చేశాడట.

ఆ ఇంటి చుట్టే వివాదం..

ఆ ఇంటి చుట్టే వివాదం..


జూబ్లీ హిల్స్‌లోని దాస‌రికి పెద్ద ఇల్లుంది. అప్ప‌ట్లో దాస‌రి అందులోనే ఉండేవారు. ఆ ఇల్లు నాదంటే నాదంటూ.. ఇద్ద‌రు కొడుకులూ త‌గువులాడుకుంటున్నారు. నిజానికి ఆ ఇల్లు ప్ర‌భు కూతురి పేరు మీద ఉంది. ప్రస్తుతం ఆ ఇంటి చుట్టూనే వివాదం న‌డుస్తోంది.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
కెమెరాకు చిక్కిన అరుణ్..

కెమెరాకు చిక్కిన అరుణ్..

ఇంట్లోకే దొంగ‌చాటుగా చొర‌బ‌డి, సీసీ టీవీ కెమెరాకు చిక్కాడు అరుణ్‌. హైద‌రాబాద్ శివార్ల‌లో దాస‌రికి ఓ ఫామ్ హౌస్ ఉందట. అందులో కొన్ని ఎక‌రాల్ని అరుణ్ అమ్మేశాడ‌ని, వాటికి సంబంధించిన డ‌బ్బులు ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌కు ఇవ్వ‌లేద‌ని ప్ర‌భు ఆరోపిస్తున్నాడు. దాస‌రికి సంబంధించిన కొన్ని ఆస్తుల్ని ఇప్ప‌టికే అరుణ్ అమ్మేశాడ‌ని, వాటి లెక్కా ప‌త్రాలు తెలియ‌కుండా పోయాయ‌ని, ఇప్పుడు ఈ ఇంటిపై ప‌డ్డాడ‌ని, త‌న‌ని చంపుతాన‌ని బెదిరించాడ‌ని ప్ర‌భు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X