»   » దాసరి పుట్టిన రోజును ‘డైరెక్టర్స్ ఢే’ గా మార్చిన చిత్రసీమ!

దాసరి పుట్టిన రోజును ‘డైరెక్టర్స్ ఢే’ గా మార్చిన చిత్రసీమ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శతాధిక చిత్రాల దర్శకుడు డా. దాసరి నారాయణరావు తన 65వ జన్మదినం సందర్భంగా 4న మహానటి సావిత్రి పేరిట జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నారు. గత నాలుగేళ్లుగా వంశీ అంతర్జాతీయ సాంస్కతిక సేవా సంస్థ ఆద్వర్యంలో దాసరి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఆయన పుట్టిన రోజును 'డైరెక్టర్స్ డే" గా చిత్రసీమ జరుపుకుంటోంది. 2006 లో ఆయన జన్మదినం సందర్భంగా నూతన దర్శకుడికి లక్షరూపాయల నగదు, అవార్డుతో ప్రారంభించిన ఈ వేడుక 2007 లో 148 మంది సినీ దర్శకులను, 2008లో 129 సినీ నిర్మాతలను, 2009లో 25మంది సినీ శాఖల సీనియర్ సాంకేతిక నిపుణులను సత్కరించారు.

ఉత్తమ నూతన దర్శకుడుకి, ఉత్తమ ఫిలిం జర్నలిస్టుకి ఉత్తమ ఫోటో ఫిలిం జర్నలిస్టులకు కూడా అవార్డులను ఆయన అందజేస్తున్నారు. అలాగే పేద విద్యార్ధులకు విద్యాభ్యాసం కోసం ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున నగదు సహాయం చేస్తున్నారు. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలో ఈ వేడుకల కమిటీలో వైస్ చైర్మెన్ గా రేలంగి నరసింహారావు, కన్వీనర్ గా వంశీరామరాజు, కో-ఆర్డినేటర్ గా కె ధర్మారావు వ్యవహరిస్తున్నారు.

2009లో మహానటి సావిత్రి జాతీయ అవార్డును స్థాపించిన దాసరి మే 4న జరిగే 65 జన్మదినోత్సవంలో ఈ అవార్డు కింద రెండు లక్షల రూపాయల నగదు, అవార్డు, ప్రశంసాపత్రం శాలువా బహుకరిస్తారు. ఈ అవార్డు విజేత ఎంపిక కోసం ప్రత్యేక కమిటిని ఏర్సాటు చేశారు. ఈ కమిటీలో ఎం. మోహన్ బాబుతో పాటు కె. రఘు, కె.సి శేఖర్ బాబు, జగదీష్ చంద్రప్రసాద్, పరుచూరి విజయలక్ష్మి, వున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X