'దాసరీ' నీకిది తగునా!
అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆంధ్ర రాష్ట్రనికే కాదు దేశానికే గర్వకారణం. ఎంతో మందిని దర్శకులుగా, నటులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. తాజాగా ఆయన మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అంతా కొత్తవారితో 'యంగ్ ఇండియా' అనే చిత్రాన్ని రూపొందించనున్నారు. దీనికోసం 'ట్యాలెంట్ హంట్' ద్వారా నటీనటులని ఎంపిక చెయ్యనున్నారు.
ఈ సంధర్భంగా దాసరి మాట్లాడుతూ "ఏ దాసరి నారాయణరావు కొడుకో, లేక ఫలానా హీరోగారి కొడుకో, లేక నిర్మాత గారి కొడుకో హీరోలుగా వస్తున్నారు. వారసత్వపు పరిశ్రమగా సినీ పరిశ్రమ తయారయిందని వ్యఖ్యానించారు. వాళ్ల మొహాలు ఎలా వున్నా, వాళ్లలో నటన వున్నా లేకపోయినా ప్రమోట్ చేస్తున్నాం అని పరోక్షంగా ఇప్పటి వారసత్వ కథానాయకుల(రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగచైతన్య, అల్లు అర్జున్...) గురించి విమర్శలు చేసారు. కానీ ఇంతకు ముందు దాసరి గారు ఆయన కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ను హీరోగా ప్రమోట్ చెయ్యాలని విశ్వప్రయత్నాలు చేసిన విషయం మరచినట్టున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆయన పెద్దరికాన్ని ఆయనే తగ్గించుకొంటున్నారన్న కమెంట్స్ ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











