నటన రాదని దాసరి కామెంట్స్ రామ్ చరణ్ నే!?
దర్శక రత్న దాసరి నారాయణరావు మరోసారి వివాదానికి తెర తీసారు.నటన రాదు, భాష రాదు, రెండు డాన్సులు చేసి సినీ పరిశ్రమను యువ హీరోలు పాడు చేస్తున్నానరని దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు.అయితే ఈ కామెంట్స్ రామ్ చరణ్ ని ఉద్దేశించే అన్నారని అంతా అంటున్నారు. దానికి కారణం ఆయన హీరోయిన్ అనూష్క పై చేసిన కామెంట్స్ కు రామ్ చరణ్ కౌంటర్ ఇచ్చారు. దాంతో ఈసారి దాసరి ఈ రకంగా కామెంట్స్ చేసారంటున్నారు. అలాగే తెలుగు సినిమాలకు తెలుగు పేర్లే పెట్టాలని ,ఇతర భాషల నటులే తెలుగు లో ఎక్కువ గా వస్తున్నారని, లోకల్ టాలెంట్ ను వాడాలని ఆయన సూచించారు. ఎస్.వి.రంగారావుకు అవార్డు రాకపోవడం దురధృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











