ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డి హఠాన్మరణం చెందడం తీవ్రదిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి అన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం కొనసాగించే తమ్ముడు పీజేఆర్ మరణించడం నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, పేద ప్రజలకు అలాంటి అరుదైన నాయకుడు దొరకడని ఆయన గద్గధ స్వరంతో చెప్పారు. పీజేఆర్ ను దగ్గరినుంచి గమనించేవాడినని దాసరి కళ్లనీళ్ల పర్యంతం అయ్యాడు. ఆయన పీజేఆర్ ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.