ఒకప్పుడు వరస సినిమాలు డైరక్ట్ చేసి దర్శకుడికి ప్రత్యేక హోదా,విలువ కల్పించిన వ్యక్తి దాసరి. తరువాత రాజకీయ్యాల్లోకి తరిలి వెళ్ళి కేంద్ర మంత్రి గా వెలిగారు. ఇప్పుడు ఆ పదవి పోయాక తిరిగి సినిమాలే బెటరంటూ దర్శక నిర్మాణ రంగం లోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత బేనరైన సిరీ మీడియా పై ఓ రాజకీయ వ్యంగ్య చిత్రం తీసేందుకు సన్నాహాలు లో ఉన్నారుట. గతంలోనూ 'పిచ్చోడి చేతిలో రాయి 'అనే ఈ తరహా చిత్రం తీసారాయన.అప్పట్లో అది వర్కవుట్ కాలేదు.మరి మళ్ళీ అలాంటి ప్రయోగం ఎంత వరకు సబబు అంటున్నారు కొందరు. రైటే గాని ఆయన డబ్బు ఆయనిష్టం అందులోనూ త్వరలో లాంచ్ కాబోతున్న ఆయన సొంత ఛానల్ 'డి' కి కొన్ని సినిమాలు కావాలి కదా అందుకోసమైనా ఉపయోగ పడుతుంది అంటున్నారు మరికొందరు.దాసరి ...ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టబోతున్నారన్నమాట.దీనికి కొసమెరుపుగా మరుధూరి రాజా తీసిన రాజకీయ వ్యంగ్య చిత్రం 'అందరికీ వందనాలు' కి 'అధ్యక్షా' అనే పేరు పెట్టమని దాసరి సజెస్టు చేయటం ఆయనకి ఈ తరహా చిత్రాలపై ఆసక్తితిని చూపెడుతోంది.
Story first published: Wednesday, April 22, 2026, 13:55 [IST]