నా భార్య ఆశ నెరవేర్చాను:దాసరి
టీవీ సీరియల్ తీయడం నా లక్ష్యం అని చెప్పడం కంటే కూడా నా భార్య పద్మ కోరిక అనడమే సబబుగా ఉంటుంది. 'అభిషేకం' 1000వ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించి నా భార్య ఆశ నెరవేర్చాను అన్నారు దాసరి నారాయణ రావు. ఆయన తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న 'అభిషేకం' ధారావాహిక వెయ్యో ఎపిసోడ్‌కి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇలా స్పందించారు.
అలాగే తెలుగులో ధారావాహికలు లేని సమయంలో తొలిసారి 'విశ్వామిత్ర' తీశాను. 'అభిషేకం'లోని ఈ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించి నా భార్య కోరిక తీర్చాను. ఈ సీరియల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. సీరియల్ మొదలైన నాటికి ఇప్పటికీ నటుల్లో ఎంతో పరిపక్వత వచ్చింది. పోటీగా ఎన్ని సీరియల్స్ వచ్చినా అభిషేకం ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఉన్నదయనీయ పరిస్థితుల్లో బుల్లి తెర లేకపోతే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేవారు అన్నారు.
టీవీ నటులంటే తక్కువగా చూసేవారు. కానీ వాళ్లే ఇప్పుడు వెండి తెర నటులతో సమానంగా ఎంతో చక్కగా నటిస్తున్నారు. అంత గొప్పగా నటించేవాళ్లు సినిమాల్లో కూడా తక్కువగానే ఉన్నారు. గతంలో సీరియల్స్ అంటే తమిళంలోనే తీయాలనేవారు. దాన్ని ఇప్పుడు మనవాళ్లు అధిగమించారుని ఆయన అన్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో జయసుధ అతిథి పాత్రధారి. ఈ కార్యక్రమంలో జయసుధ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.
ఇక దాసరి నారాయణరావు ..బాలకృష్ణతో తీసిన పరమ వీర చక్ర తర్వత మరే చిత్రాన్ని డైరక్ట్ చేయలేదు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ఆయన చాలా నిరాశ చెందారు. ఆ చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా అవార్డుల పరంగా అయినా తనను తృప్తి పరుస్తుందని ఆశించారు. అలాగే స్టేట్ మెంట్స్ సైతం ఇచ్చారు. ఆ కోణంలోనూ ఆయన సంతృప్తి లేకుండా పోయింది. దాంతో కొంత కాలంగా వెండితెరకు గ్యాప్ ఇచ్చిన ఆయన త్వరలోనే ఓ చిత్రంతో రానున్నాడని వినికిడి. ప్రస్తుతం ఆయన సంస్ధ ద్వారా టీవి సీరియల్స్ తీస్తూ బిజీగా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











