»   » దాసరి ఎఫెక్ట్ :చిరు, పవన్ కలిసి ప్రెస్ మీట్

దాసరి ఎఫెక్ట్ :చిరు, పవన్ కలిసి ప్రెస్ మీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య చాలా కాలంగా విభేధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మెగా ఫ్యాన్స్ అశోశియోషన్ లో ఆదివారం చర్చకు వచ్చినట్లు సమాచారం. మెగా బ్రదర్ నాగబాబు ఈ మీటింగ్ ని ఆర్గనైజ్ చేసారు. ఈ మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చిన ఈ అంశాన్ని నాగబాబు పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పు్డదే హాట్ టాపిక్ గా మారింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మీటింగ్ లో ఓ అభిమాని చిరు, పవన్ ల మధ్య విభేధాలు విషయమై అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధాన మిస్తూ... "మెగా ఫ్యామిలీలో ఏ విధమైన విభేదాలు లేవు. మేమంతా కలిసే ఉన్నాం. మీడియాలో వచ్చేవన్నీ అవాస్తవాలే. త్వరలోనే నేను చిరంజీవి,పవన్ కళ్యాణ్ కు కలిసి మీ అందరితో మీటింగ్ పెట్టమని సూచిస్తాను ," అన్నారు. ఈ విషయం విన్న మెగా ఫ్యాన్స్ అంతా అనందోత్సాహాలతో సెలబ్రెట్ చేసుకుంటున్నారు.

Dasari Effect: Chiru-Pawan's Press Meet!

అలాగే.. మెగాస్టార్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు మెగా బ్రదర్ నాగబాబు కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరయ్యారని సమాచారం. మెగా ఫ్యాన్స్ అంతా కలిసి నాగబాబును మరో విషయంపైనా నిలదీశారు. అదేమిటింటే..అంటే... రీసెంట్ గా జరిగిన సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో దాసరి నారాయణ రావు ..పవన్ ని అందరూ అనుకరిస్తున్నారని, ఆయన ఒక్కడే ఎఎన్నార్, ఎన్టీఆర్ తర్వాత తనదైన స్టైల్ ని ఏర్పడుచుకున్నారని అన్నారు. ఎక్కడా చిరంజివి ని ప్రస్తావించలేదు.

ఎన్టీఆర్, ఎఎన్టీఆర్ తరం తర్వాత మెగా స్టార్ చిరంజీవి దే కదా.. దాంతో వారు మెగాస్టార్ చిరంజీవి పై దాసరి చేసిన వ్యాఖ్యపై వారు భావించి మండిపడ్డారని సమాచారం. చిరంజీవిని పట్టింపులేనట్లుగా దాసరి మాట్లాడారంటూ, దీనిపై మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించకపోవడం ఏంటంటూ నిలదీశారు. హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలెరీలో మెగా అభిమానుల సంఘం సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మెగాస్టార్ అభిమాన సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మెగా హీరోలంతా విభేదాలను పక్కనబెట్టి ఐకమత్యంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. లేదంటే ఆ ప్రభావం మెగా హీరోల సినిమాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభిమానుల ఆగ్రహాన్ని ఓపిగ్గా భరించిన నాగబాబు త్వరలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను ఒకే వేదికపైకి తీసుకు వస్తానని హామీ ఇవ్వడంతో చల్లబడ్డారు.

కాగా చిరంజీవి అభిమాన సంఘం కొత్త కమిటీలను ప్రకటిస్తూ... ఏపీకి ప్రసాద్ రెడ్డి, తెలంగాణకు కరాటే ప్రభాకర్ లను నియమించారు. ఇప్పటివరకూ చిరు అభిమాన సంఘం అధ్యక్షుడుగా ఉన్న స్వామినాయుడిని అఖిలభారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా నియమించారు.

English summary
"There is no rift in Mega Family and we stay united forever. What was speculated in Media is untrue. Soon, I am going to suggest Chiranjeevi and Pawan Kalyan to hold a joint meeting with all of you," Mega Brother Naga Babuassured.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu