twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోల మీద దాసరి పంచ్:ఇకనైనా మార్పు వస్తుందా..??

    |

    ఎవ్వరూ నోరు మెదపని విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు దర్శకరత్న దాసరి నారాయణరావు. తాజాగా ఓ చిన్న సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ స్టార్ హీరోల సినిమాల మీద లేని పోని హైప్ క్రియేట్ చేస్తూ.. చివరికి థియేటర్లలోకి వెళ్తే పెద్ద షాకులిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.

    అసలు పెద్ద సినిమాల్ని ఆ స్థాయిలో ప్రమోట్ చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు.తమ కి ఇంత ఫాలో యింగ్ ఉందీ అంత ఫాలోయింగ్ ఉందీ అని చెప్పుకునే ఈ పేద్ద స్టార్లు ప్రమోషన్ లేకుండా జనాల్ని థియేటర్లకు రప్పించ లేరా? ఇన్ని రకాల ప్రమోసహ్న్లెందుకు?

    Dasari

    "చిన్న సినిమాలకు ఆడియో ఫంక్షన్, ప్రమోషన్ కార్యక్రమాలు అవసరం. పెద్ద చిత్రాలకు వాటితో పనిలేదు. సినిమా విడుదలకు ముందే ఆడియో ఫంక్షన్లని.. టీజర్లని.. ట్రైలర్లని.. మేకింగ్ వీడియోలని.. ఇలా ఏదేదో చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు.

    తీరా విడుదలయ్యాక ఆ అంచనాలు అందుకోలేక ఈ మధ్య చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చివరికి సినిమా నష్టాలు మిగిల్చాక హీరోలు తిరిగి డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తోంది. అసలు పెద్ద సినిమాలకు ప్రమోషన్లు ఎందుకు? థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే సత్తా స్టార్లకు లేదా?'' అన్నారు దాసరి.

    స్టార్ హీరోల సినిమాలకు పూర్తిగా ప్రమోషన్లు ఆపేయాలని అనడం సరి కాదు కానీ.. లేని పోని హడావుడితో హైప్ తీసుకురావడం.. ఒకేసారి వేల థియేటర్లలో రిలీజ్ చేసి సొమ్ము చేసుకోవాలని చూడటం మాత్రం మంచి పరిణామం కాదు. పొరుగు ఇండస్ట్రీల్లో ఇలాంటిపరిస్థితి కనిపించదు.

    అక్కడ సినిమాలకు ఇప్పటికీ లాంగ్ రన్ ఉంటోంది. కానీ ఈ ఓపెనింగ్స్ హడావుడిలో మన సినిమాలే రోజు రోజుకూ కుచించుకుపోతున్నాయి. మరి దాసరి మాటల్ని ఏ స్టార్ హీరో అయినా పట్టించుకునే పరిస్థితి ఉందా అన్నదే డౌటు.

    English summary
    They just keep waiting for the dates of a star hero and earn crores by making hero-centric film with those heroes… These producers are ready to eat any kind of grass for acquiring the dates" says Dasari Narayana Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X