»   » హీరోల డేట్స్ కోసం గడ్డి తింటున్నారు: దాసరి (ఫోటోలు)

హీరోల డేట్స్ కోసం గడ్డి తింటున్నారు: దాసరి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కార్యక్రమం ఏదైనా ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసే దర్శక రత్న దాసరి నారాయణరావు....ఈ సారి కొందరు నిర్మాతలపై తన విమర్శనాస్రాలు సంధించారు. 'తాత మనవడు' విడుదలై 41 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, వేయి పున్నములు దర్శించిన ప్రముఖ చిత్ర నిర్మాత కె . రాఘవ ను 'యువకళావాహిని' ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ...'ఇప్పుడు నిర్మాత అనే మాటకు అర్ధం మారిపోయింది . క్యాషియర్లు, ఫైనాన్షియర్లు, మీడియేటర్లు నిర్మాతలల అవతారం ఎత్తారు. కొందరు నిర్మాతలు హీరోల డేట్స్ ఇస్తే కోట్లు సంపాదించుకోవచ్చనే ఆశతో ఏ గడ్డి కరవడానికై సిద్ధపడుతున్నారు' అని దాసరి వ్యాఖ్యానించారు.

మిగతా వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో....

రాఘవ లాంటి నిర్మాత కావాలి

రాఘవ లాంటి నిర్మాత కావాలి

సినిమా పట్ల, నిర్మాణం పట్ల పూర్తి అవగాహనతో వుండే నిర్మాతలు పరిశ్రమకు కావాలి . కె .రాఘవ వంటి నిర్మాతలు వుంటే మన చిత్ర పరిశ్రమకు ఈ దుర్గతి పట్టేది కాదని దాసరి వ్యాఖ్యానించారు.

ఆ అవకాశం వల్ల

ఆ అవకాశం వల్ల

రాఘవ నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఉండకపోతే నాద్వారా 48 మంది దర్శకులు వచ్చివుండే వారు కాదు. ఒకరిని మనం ఆదుకుంటే -అతడు పదిమందికి ఆధారమవుతాడని నమ్మిన మనిషి కె .రాఘవ అన్నారు.

స్టార్స్ వెంట పడలేదు

స్టార్స్ వెంట పడలేదు

నేను గానీ, నా శిష్యులు గానీ మంచి కధల వెంట పడ్డామే తప్ప, స్టార్స్ వెంట పడలేదు అంటూ దాసరి విమర్శలు సంధించారు.

ఈ కార్యక్రమంలో..

ఈ కార్యక్రమంలో..

కోడిరామకృష్ణ , తమ్మారెడ్డి భరద్వాజ , రేలంగి నరసింహారావు , పరుచూరి హనుమంతరావు , వీరశంకర్ , రంగనాద్ , అర్ .నారాయణ మూర్తి , నారాయణ రావు , డా " రామ్ దొర, 'సంధ్య ఫిల్మ్స్' సుబ్బారావు, 'యువకళావాహిని' అధ్యక్షులు వై .కె .నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.

English summary
"Financiers, cashiers, mediators, and brokers are the current day producers and they have zero knowledge in the film making process." Dasari Narayana Rao said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu